Wednesday, April 17, 2024

హాస్టల్ గదిలో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హాస్టల్ గదిలో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన దుర్గ ప్రసాద్ (29) గచ్చిబౌలిలో శ్రీదుర్గ మెన్స్ పీజీ హాస్టల్‌లో నివాసముంటు వ్యాపారం చేసుకుంటున్నాడు. గత 11 నెలలుగా హాస్టల్‌కు రెంట్ కట్టకపోవడంతో హాస్టల్ యజమానికి అతనికి మధ్య గొడవ జరిగింది. ఈ విషయమై మనస్తాపానికి గురైన అతడు తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఈ విషయమై మృతుడి బావ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలిసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News