Sunday, April 28, 2024

ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆశతో కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ యువతి ఓ టీవీ యాంకర్‌ను ఇష్టపడింది. ఆయనతో చాట్ చేసింది. ఆతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఇందుకు ఆ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో కిరాయి మనుషులతో ఆ యువకుడిని కిడ్నాప్ చేయించింది. అయితే అ యువకుడు కిడ్మాప్ చెర నుండి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. ప్రణవ్‌ను పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్‌నకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు సదరు యువతిని అరెస్టు చేశారు. . సినిమా ఫక్కిలా ఉన్న ఈ ఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకంది. జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను శుక్రవారం ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో ఎసిపి పురుషోత్తంరెడ్డి మీడియాకు వివరించారు. ఉప్పల్ న్యూ భరత్ నగర్‌లో నివాసం ఉంటున్న ప్రణవ్ సిస్టా (27) అనే యువకుడు ఓ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు.

ఇదేక్రమంలో ప్రణవ్ ఫోటోతో భారత్ మ్యాట్రీమోనీ లో చైతన్యరెడ్డి పేరుతో ఓ నకిలీ ఐడి క్రియేట్ అయి ఉంది.ఇదేక్రమంలో మాదాపూర్ డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం నిర్వహిస్తున్న బోగిరెడ్డి త్రిష( 31) అనే మహిళ ఇప్పటీకే వివాహాం కాగా విడాకులు తీసుకుంది. దీంతో ఆమె మరో వివాహం చేసుకునేందుకు మ్యాట్రీమోనీలో సేర్చ్ చేస్తున్న క్రమంలో ప్రణవ్ ఫోటోతో ఉన్న నకిలీ ఐడితో చైతన్యరెడ్డి చాట్ చేయడం, క్రమంగా పరిచయం పెరిగి త్రిష్ట నుంచి రూ.40 లక్షలు తీసుకున్నట్లు ఎసిపి తెలిపారు. ఆ తర్వాత ఆయన త్రిష్ణకు అందుబాటులోకి రాకపోవడంతో చైతన్యరెడ్డి పేరుతో ఫోటో ఉన్న ప్రణవ్‌ను గాలింపు మొదలు పెట్టింది. దీంతో అసలు వ్యక్తి అతను కాదని తెలిసినా ఒత్తిడి పెంచింది.అంతేకాకుండా అదినా ఐడి కాదని భారత్ మ్యాట్రీమోనికి సిబ్బందికి అతను ఫిర్యాదు సైతం చేశారు. అయితే ఫోటోలో ఉన్నది నువ్వే కాదాని నిన్నే ఇష్టపడ్డాను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి పెంచింది.

ప్రణవ్ తనకు ఇష్టంలేదని స్పష్టం చేయడంతో త్రిష్ణ నా రూ.40 క్షలు నాకు ఇవ్వాలని మరింత పట్టుబట్టడంతో తనకు సంబంధంలేదని తేగిసి చెప్పారు. దీంతో ఎలాగైనా ప్రణవ్‌ను సోంతం చేసుకోవాలని ఆశతో త్రిష్ణ కిరాయి మనషులతో ఈనెల 11న ప్రణవ్‌ను కిడ్నాప్ చేయించింది. అంతేకాకుండా తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని రాతంత్రా ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. మరసటి రోజు కిడ్నాప్ నుంచి తప్పించుకున్న ప్రణవ్ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితురాలు త్రిష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా, మరో 4గురు నిందుతులు పరారీలో ఉన్నట్లు ఎసిపి పురుషోత్తం రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News