Saturday, May 4, 2024

దొంగతనం బయటపడుతుందేమోనని బాలుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జోగిపేట: స్క్రాప్ దుకాణంలో వైరు దొంగతనం ఒక బాలుడి హత్యకు దారితీయగా, ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి భయంతో ఆ త్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జరిగిన బాలుడి హత్యోదంతం ఘటన సంగారెడ్డి జిల్లా, అందోల్ మండలం, జోగిపేటలో సంచలనం రేపింది. జోగిపేట సిఐ అనిల్‌కుమార్ తెలిపిన వివ రాల ప్రకారం… జోగిపేటకు చెందిన వడ్డె నాగరాజు (28) తల్లిదండ్రులు లేని అనాథ. చిన్నతనం నుంచే చిన్నచిన్న దొంగతనాలకు అలవాటుపడ్డాడు. కూలి పని చేసుకుంటూ అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తూ పొలీసులకు చిక్కి జైలు జీవితం గడిపాడు. రెండు రోజుల క్రితం తాను పనిచేసే స్క్రాప్ దుకాణంలో వైరు దొంగతనం చేశాడు. డబ్బులు పంచుకునే విషయంలో ఆలకుంట శేఖర్ (13)కి, వడ్డె నాగరాజుకు మధ్య గొడవ జరిగింది. వైరు దొంగతనం విషయమై శేఖర్ తమ యజమానికి చెప్పాడు. ఈ విషయం కాస్త పోలీసుల వరకు చేరింది. ఒకపక్క పోలీసుల భయం, ఇంకోపక్క దొంగతనం బయటపెట్టాడనే కోపంతో కసి పెంచుకొన్న నాగరాజు శనివారం రాత్రి శేఖర్‌కు మాయమాటలు చెప్పి చెరువు వద్దకు తీసుకువెళ్లాడు.

అక్కడ బండరాయితో తలపై మోది, గొం తు నులిమి హత్య చేసి, చెరువు శిఖంలోని బావిలో పడేశాడు. అనంతరం చేతిలో కత్తి పట్టుకొని భయంతో సెల్‌టవర్ ఎక్కాడు. తన స్నేహితులకు ఈ విషయంమై ఫోన్ చేసి చెప్పాడు. వారు వచ్చి టవర్ పైనుంచి కిందికి దింపే ప్రయత్నం చేయగా వడ్డె రాము అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వడ్డె రామును ఆసుపత్రికి తరలించారు. ఇది లా ఉండగా వడ్డె నాగరాజు శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్మా హ్నం వరకు సెల్‌టవర్‌పైనే ఉన్నాడు. పోలీసులు ఆదివారం ఉదయం రంగప్రవేశం చేసి అతనిని సముదాయించి కిందకు దించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మధ్యాహ్నం సమయంలో నాగరాజు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఉలుకు, పలుకు లేకపోవడంతో అనుమానించిన పోలీసులు డ్రోన్ కెమెరాలను తెప్పించి వాటితో పరిశీలించగా నాగరాజు సెల్‌టవర్‌పై గల కేబుల్‌తో ఉరి వేసుకొని మృతి చెందాడు. సెల్‌టవర్ పై అంతస్థుకి ఎక్కడంతో మృతదేహాన్ని దింపేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. తాళ్ల సహాయంతో కాళ్లకు తాడు కట్టి కిందికి దింపారు.

ఇదిలా వుండగా, హత్యకు గురైన బాలుడు శేఖర్ మృతదేహం కోసం గజ ఈతగా ళ్లు బావిలోకి దిగి వెలికి తీశారు. నాగరాజుతోపాటు శేఖర్ మృతదేహాల ను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో బాలుడి కుటుంబీకుల, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బాలుడి హత్య కేసుతో పాటు నాగరాజు ఆత్మహత్యపై రెండు కేసులు న మోదు చేసినట్లు సిఐ తెలిపారు. కాగా, బాలుడి హత్యకు ముందు కిరాణా వ్యాపారి ప్రకాశ్‌ను డబ్బులు ఇవ్వాలని నాగరాజు డిమాండ్ చేశాడు. అతను నిరాకరించడంతో అతని తలపై దాడి చేయగా గాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News