Sunday, October 1, 2023

యువత క్రీడల్లో ముందుండాలి

- Advertisement -
- Advertisement -

వరంగల్ : యువత దురవాలట్లకు పోకుండా వ్యాయామం, క్రీడల్లో రాణించాలని భూపాలపల్లి ఎం ఎల్‌ఎ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నా రు. బుధవారం భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుడ్‌బాల్ టోర్నమెంట్ క్రీడల పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ గండ్ర మాట్లాడుతూ మారుతున్న కాలంలో సగటు మనిషి వ్యాయామంపై శ్రద్ద చూపాలని కోరారు.

క్రీడల్లో క్రీడాకారులు గెలుపోటములు సహజమేనని, ఒడినవారు మళ్లీ గెలుపు దిశగా అడుగు వేయాలని కోరారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫుట్‌బాల్ క్రీడాకారులను అభినందించి, ఆటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News