Tuesday, September 17, 2024

రాజస్థాన్ లో ఘనంగా షర్మిల కుమారుడి వివాహం..

- Advertisement -
- Advertisement -

ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో హిందూ సంప్రదాయల్లో శనివారం సాయంత్ర షర్మిల కుమారుడు రాజారెడ్డి-ప్రియా అట్లూరి పెళ్లి వైభవంగా జరిగింది. ఈనెల 16 నుంచి మొదలైన పెళ్లి సంబురాల్లో భాగంగా మంగళస్నానాల వేడుక(హల్దీ)ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.  ఈ సందర్భంగా తన కుమారుడి హల్దీ వేడుక ఫోటోలను షర్మిల సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం క్రైస్తవ సంప్రదాయంలో వీరి పెళ్లి జరగనుంది. అయితే, తన మేనల్లుడి వివాహనానికి ఎపి సీఎం జగన్ గర్హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్ కుటుంబంలో పొలిటికల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ పెళ్లికి జగన్ దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News