Saturday, April 20, 2024

విమానాశ్రయంలో 1.5 కిలోల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

1.5 KG gold captured in RangaReddy

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో బంగారాన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా దుబాయ్ నుంచి వచ్చిన మహిళ వద్ద నుంచి 1.593 కిలోల బంగారాన్ని గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపుగా రూ.74 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. సదరు మహిళను అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు అబ్దుల్ ఎజాస్ వద్ద నుంచి విదేశీ సిగరెట్లు లభ్యమయ్యాయి. 150 విదేశీ సిగరెట్ల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ ఎజాస్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News