Saturday, April 27, 2024

అక్రమంగా తరలిస్తున్న 110కిలోల గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/షాద్‌నగర్: అక్రమంగా కారులో తరలిస్తున్న గంజాయిని స్థానిక పోలీసులు పట్టుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక ఏసిపి కుషాల్కర్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం రాయికల్ టోల్‌గేట్ వద్ద శంషాబాద్ ఎస్‌ఓటి, షాద్‌నగర్ పోలీసులు సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో గుంటూరు, కర్నూల్ మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్న 110కిలోల గంజాయితోపాటు కారు, సెల్‌ఫోన్‌లో సీజ్ చేయడంతోపాటు వ్యక్తిని అరెస్టు చేసినట్లు వివరించారు. నేరస్థుల జాబితాకు సంబంధించి కుర్వ రమేష్ (35), వృత్తి ప్రైవేట్ డ్రైవర్, ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ పంచాయతీ రంగ సముద్రంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురిలోని మారుతినగర్ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు తెలిపారు. మరో నింధితుడు వీరన్న(30)గూడూరు గ్రామం నర్సాపేట్ మండలం వరంగల్ జిల్లా, మరో నింధితుడు సోమరాజు బద్రాచలంకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు వివరించారు. ముగ్గురు నింధితుల్లో ఇద్దరు నింధితులు పరారీలో ఉన్నట్లు ఏసిపి తెలిపారు. నింధితుడు కుర్వ రమేష్, వరంగల్‌కు చెందిన వీరన్న అదేశాల మేరకు భద్రాచలం వెళ్ళి అక్కడ సోమరాజు అనే వ్యక్తిని కలిసి అక్కడ 110కిలో గంజాయిని నింధితుడు రమేష్ తన వాహనంలో వెనుక భాగంలో వెసుకొని వచ్చారు. హైదరాబాద్ వెళ్ళె క్రమంలో రాయికల్ టోల్ గేట్ వద్ద మంగళవారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News