Friday, March 29, 2024

అండగా ఉంటాం… తొందరపడొద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆత్మగౌరవం కోసం దీక్షల్లో ఇతరత్రా నిరసనల్లో ఉన్న రెజ్లర్లకు కపిల్ సేన నుంచి మద్దతు దక్కింది. వారి ఉద్యమానికి తమ అండదండలు ఉంటాయని 1983 వరల్డ్ కప్ విజేత టీం సభ్యులు సంయుక్తంగా ప్రకటించారు. రెజ్లర్లు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని , ఈ తోటి క్రీడాకారుల సమస్యలను సంబంధితులు ఆలకించి, పరిష్కారిస్తారని ఈ క్రికెట్ టీం ఆభాభావం వ్యక్తం చేసింది. మన దేశానికి పతకాలను సాధించి పెట్టిన మన చాంపియన్ రెజ్లర్లపై పలు రకాల దౌర్జన్యాలు జరగడం, వారిని రోడ్లపై పడేయడం వంటి పలు ఘట్టాల దృశ్యాలు తమ దృష్టికి వచ్చాయని, ఇది బాధాకరం అని , దీనితో కలతచెందామని పేర్కొన్నారు.

పైగా ఎంతో కష్టపడి , అంకితభావానికి ఫలితంగా రెజ్లర్లు సాధించుకున్న విశిష్ట జాతీయ అంతర్జాతీయ పతకాలను న్యాయం కోసం దీక్షలో భాగంగా గంగలో కలిపేయాలనుకుంటున్నారని తెలిసిందని, ఇది బాధకరం అని పేర్కొన్న ఈ క్రికెట్ టీం హీరోలు రెజ్లర్లు ఇటువంటి నిమజ్జనానికి పాల్పడవద్దని కోరారు. తొందరపాటు చర్యలు వద్దని, సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు, చట్ట ప్రకారం అంతా సాగనివ్వండని తరువాతి క్రమంలో న్యాయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. భారతీయ కుస్తీ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు దిగుతున్నారనే అంశం ఇప్పుడు ధర్నాలకు చివరికి గంగలో రెజ్లర్ల పతాకాల నిమజ్జనం చేసే యత్నాలకు చేరుకున్న దశలో క్రికెట్ దిగ్గజాల సంయుక్త ప్రకటన వెలువడింది.

1983లో కపిల్ దేవ్ సారధ్యంలో భారతీయ క్రికెట్ జట్టు వెస్టిండిస్ జట్టును ఓడించి ప్రపంచ కప్ గెల్చుకున్న విషయం తెలిసిందే. తాను రెజ్లర్ల విషయంలో వ్యక్తిగతంగా చెప్పడానికి ఏమీలేదని, రెజ్లర్లకు మద్దతు ఇస్తున్నామనే ప్రకటనకు అంతా కట్టుబడి ఉన్నట్లు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ తెలిపారు. ఈ జట్టులో రోజర్ బిన్ని (ఇప్పుడు బిసిసిఐ ప్రెసిడెంట్) , క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, మోహిందర్ అమర్‌నాథ్, కె శ్రీకాంత్, సయ్యద్ కిర్మానీ, యశ్‌పాల్ శర్మ, మదన్‌లాల్ , సందీప్ పాటిల్, కీర్తి ఆజాద్ వంటి వారు ఉన్నారు.

ఇప్పటికే మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్‌లు రెజ్లర్ల ఆందోళనకు సంఘీభావ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న పలువురు క్రికెటర్లు ఎటువంటి స్పందనకు దిగలేదు. ఇక జువ్లైన్ చాంపియన్ నీరజ్ చోప్రా, షూటర్ అభినవ్ బింద్రా రెజ్లర్ల పట్ల జరిగిన అవమానకర దురుసు ప్రవర్తనల పట్ల తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అనుచిత వ్యవహారం అయిందని స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News