Tuesday, May 7, 2024

వార్డులు (రి)

- Advertisement -
- Advertisement -

TS-municipal-polls

మున్సిపోల్స్‌కు వార్డుల రిజర్వేషన్

పురపాలకశాఖ అధికారిక ప్రకటన

మన తెలంగాణ /హైదరాబాద్ : మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ పూర్తయింది. ఎన్నికలు నిర్వహించనున్న మొత్తం 120 పురపాలక సంఘాలకు, 10 పురపాలక సంస్థలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్‌ల జాబితాను శనివారం పురపాలక శాఖ అ ధికారికంగా విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల్లోని ఓటర్ల సంఖ్య ఆధారంగా ఎస్‌టి, ఎస్‌సి, బిసి, మహిళా, జనరల్ కేటగిరీలను ఖరారు చే స్తూ ప్రకటన విడుదల చేసింది. 120 మున్సిపాలిటీల్లో ని 2727 వార్డులుండగా, 10 పురపాలక సంస్థల్లో 38 5 డివిజన్‌లు ఉన్నాయి. వీటిలో ఎస్‌టిలకు మొత్తం 17 1 వార్డులు రిజర్వేషన్ కాగా అందులో మహిళలకు 2 8, జనరల్‌గా 143, ఎస్‌సిలకు మొత్తం 404 వార్డు లు కేటాయించగా అందులో మహిళలకు 166, జనరల్‌గా 238 వార్డులను కేటాయించారు.

బిసిలకు మొత్తం వార్డులు 962 కేటాయించగా అందులో మహిళలకు 447, జనరల్ కేటగిరీలో 505 వార్డులు ఉన్నాయి. జనరల్ మహిళ కేటగిరీలో 897 వార్డుల, రిజర్వేషన్‌లేనటువంటి వార్డులు 682 లను పురపాలక విభాగం ప్రకటించింది. ఎస్‌టిల జనాభా ఒక శాతం కంటే తక్కువగా వున్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోను వారికి ఒక వార్డును రిజర్వు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రిజర్వేషన్ల వివరాలను జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల అధికారి పంపారు. ఈ రిజర్వేషన్లను జిల్లాల వారీగా కలెక్టర్లు జనవరి 5వ తేదీ ఆదివారం వెల్లడిస్తారు. దీంతో పట్టణస్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లపై ఉన్న ఆసక్తికరమైన చర్చకు శనివారంతో తెరపడినట్టైంది. ఇక శనివారం నాడే మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మెన్‌లకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.

బిసి-962(మహిళలు 447)
ఎస్‌సి – 404(166)
ఎస్‌టి -171(28)
మహిళలు(జనరల్) – 897
నాన్‌రిజర్వడ్ – 682
మొత్తం మున్సిపాలిటీలు-120
వార్డులు – 2727
పురపాలకసంస్థలు – 10
డివిజన్లు – 385

మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల ఖరారు నేడు

మొత్తం ఓటర్లు    53,36,605

మహిళలు              పురుషులు

26,64,              26,71,
557                 694

1st phase reservation of wards for municipal polls over

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News