Saturday, July 27, 2024

ఎదురులేదు

- Advertisement -
- Advertisement -
CM-KCR
టిఆర్‌ఎస్‌కు ఎవరూ పోటీకాదు
పురపోరులో అఖండ విజయం ఖాయం, సర్వేలన్నీ టిఆర్‌ఎస్ వైపే, ఇంటింటికీ వెళ్లండి, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించండి, ఆత్మీయ సమ్మేళనాలు జరపండి, ఫలితాలకు ఎంఎల్‌ఎలే బాధ్యులు, విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్
నేటి నుంచి మున్సిపోల్స్ ప్రచారం

మన తెలంగాణ/హైదరాబాద్ :నియోజకవర్గాలవారీగా ఆత్మీయసమ్మేళనా లు ఏర్పాటు చేసి పాత,కొత్త కార్యకర్తలందరిని మున్సిపాలిటీఎన్నికల కోసం సిద్ధం చే యాలని టిఆర్‌ఎస్ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎ న్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించిన టిఆర్‌ఎస్ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో అఖం డ విజయం సాధించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రారంభించిన ఆభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన పార్టీ నేతల కు దిశానిర్దేశం చేశారు. స్థానికంగా జరిగే ఈ ఎన్నికల పోరులో శానసభ్యులు గెలుపు ఒటమిలకు బాధ్యత వహించాలని సిఎం కెసిఆర్ చెప్పారు.

శాసనసభ్యులు ఆహ్వానం మేరకు అవసరమున్న మున్సిపాలిటీల్లో మంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చెప్పారు. శాసనసభ్యులపై బాధ్యతలు మోపినప్పటికీ మంత్రులు బాధ్యతా యుతంగా జిల్లాలవారిగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సమిష్టి గా విజయం సాధించాలన్నారు. ఎన్నికలు అయ్యేంతవరకు నియోజకవర్గాల్లోనే శాసనసభ్యులు ఉండాలని ఆయన ఆదేశించారు. శ నివారం టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆంతరంగికంగా జరిగిన ఈ సమావేశానికి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, మంత్రులు, పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, జిల్లాపరిషత్ ఛైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.

ఈ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ సంపూర్ణ విజయం సాధించనుందని చెప్పారు. స్థానికంగా జరిగే ఈ ఎన్నికల్లో శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పటికప్పుడు శాసనసభ్యులు నివేదికలు రూపొందించి రాష్ట్ర నాయకులకు సమర్పించాలని సూచించారు.

ఏ పార్టీ టిఆర్‌ఎస్‌కు పోటీ కాదు

గత ఆరుసంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలిస్తూ అనేక సంస్కరణలు, సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చే స్తూ ప్రజల్లో చెక్కుచెదరని అభిమానంతో ఉన్న టిఆర్‌ఎస్‌కు ఏ పార్టీ పోటీ కాదన్నారు. కాంగ్రెస్,బిజెపిలు సొం త డబ్బాలు కొట్టుకుంటున్నప్పటికీ ఆపార్టీల పట్ల ప్రజలకు నమ్మకం లేదన్నారు. అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారని చెప్పా రు. కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి టిఆర్‌ఎస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. బిజెపి తమకు రాష్ట్రంలో పట్టుఉందని ప్రగల్భాలు పలికినంత మాత్రాన ఎన్నికల్లో గెలవదన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయం సాధించిన టిఆర్‌ఎస్ మున్సిపాల్టీ ఎన్నికల్లోనూ పూర్తి స్థాయి విజయం సాధిస్తుందన్నారు.

నేటి నుంచి ఎన్నికల ప్రచారం

మున్సిపాలిటీల వారిగా నేటి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం నుంచి స్థానిక నాయకులు ఎక్కడికక్కడ ఎన్నికలప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులు ఎవరైనా పార్టీ విజయం ముఖ్యమన్నారు. శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు అభ్యర్థుల జాబితాను రూపొంచించాలని ఆయన ఆదేశించారు. శాసనసభ్యులు రూపొందించిన ఈ జాబితాలను పార్టీ అధిష్టానం పరిశీలించి అమోదించనుందన్నారు. మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశాలున్న నాయకులకు కొన్నిసందర్భాల్లో అవకాశాలు రాని పక్షంలో పార్టీపరంగా వారిని గౌరవించి భవిష్యత్‌లో అవకాశాలు కల్పిస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. స్థానికంగా ఎక్కడ తిరుగు బాటు లేకుండా ఎంఎల్‌ఎలు వ్యవహరించాలన్నారు. అందరినీ కలపుకుని పార్టీవిజయంకోసం నిరంతరం శ్రమించాలని గుర్తు చేశారు. శాసన సభ్యులపై భారం వేసినప్పటికీ అందరూ కలిసి ఎన్నికల్లో పనిచేయాలని ఆదేశించారు.

ఎన్నికల సర్వేలు అన్నీ అనుకూలం

టిఆర్‌ఎస్‌ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, మున్సిపాలిటీ ఎన్నికల సర్వేలు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చాయని సిఎం కెసిఆర్ చెప్పారు. రాష్ట్రంలో అడ్రసు లేకుం డా పోయిన కాంగ్రెస్, ప్రగల్భాలు పలుకుతున్న బిజెపి మున్సిపాలిటీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కనుమరుగు అవుతాయన్నారు. మున్సిపాలిటీల వారిగా చేయించిన సర్వేల్లో టిఆర్‌ఎస్‌కు విజయావకాశాలు అత్యధికంగా ఉ న్నాయని చెప్పారు. అయితే సర్వేలతో పాటుగా నాయకు లు కూడా ప్రజల్లోకి వెళ్లి పార్టీ విజయాలకోసం మరింత కృషిచేస్తే మెజారిటీ పెరుగుతుందన్నారు. రాష్ట్ర నాయకుల ప్రచారానికంటే స్థానిక నాయకులు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కావాలని చెప్పారు.

వార్డుల వారిగా టిఆర్‌ఎస్ పార్టీశ్రేణులు ఇంటింటికి ప్రచారం చేయాలని చెప్పారు. స్థానిక నాయకులు,ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసిఉండాలని సిఎం కెసిఆర్ సూచించారు. గత ఆరు సంవత్సరాలుగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇంటింటికి సంక్షేమపథకాలను వివరిస్తే మున్సిపాలిటీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయాలు సాధిస్తామని సిఎం కెసిఆర్ చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, పల్లెప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయితీ చట్టం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలపాలని ఆయన చెప్పారు.

ఆత్మీయ సమావేశాలు

నియోజకవర్గాల వారిగా ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని గులాబి బాస్, సిఎం కెసిఆర్ ఆదేశించారు. నియోజకవర్గాల వారిగా శాసనసభ్యులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి నియోజకవర్గానికి చెందిన నాయకులను, ప్రజాప్రతినిధులను, స్థానిక టిఆర్‌ఎస్ నాయకులను ఆహ్వానించి సమావేశాలు జరపాలన్నారు. అలాగే ఎక్కడికక్కడ వార్డులు, డివిజన్లు, మండలాలవారిగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించి అందరిని కలుపుకొని ఎన్నికలపోరులో నిలబడాలని ఆయన చెప్పారు.మున్సిపాలిటీ ఎన్నికల పోరులో ఆత్మీయ సమావేశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నియోజకవర్గాలనుంచి ప్రాతినిథ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులందరూ స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చెప్పారు.

అభ్యర్థుల ఎంపిక

రిజర్వేషన్లను అతిక్రమించకుండా స్థానిక నాయకులకు అవకాశాలు కల్పిస్తూ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం దగ్గర ఉన్న నివేదికలను పరిశీలించి స్థానిక శాసన సభ్యుడు సూచించిన పేర్లను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఎవరికి అవకాశం దక్కినా అందరూ కలిసి గెలిపించేందుకు కృషిచేయాలని చెప్పారు. పార్టీ ఎవరికి పార్టీ టిక్కెట్టు ఇచ్చినా, ఎవరిని కార్పొరేషన్, మున్సిపాలిటీ ఛైర్మన్‌గా ఎంపిక చేసినా సంఘటితంగా మద్దతివ్వాలన్నారు.

నాయకులతో విడివిడి సమావేశాలు

పూర్వ పదిజిల్లానాయకులతో పార్టీఅధినేత కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విడివిడిగా సమావేశమయ్యారు. జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించారు. ఆంతరంగికంగా జరిగిన ఈ సమావేశంలో జిల్లానాయకులకు అనేక సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీల్లో గులాబి జెండా ఎగరవేసేందుకు కృషి చేయాలని చెప్పారు. జిల్లాలలోని మున్సిపాలిటీల వారిగా సిఎం కెసిఆర్ సమీక్షించారు. గత ఆరు సంవత్సరాలుగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయలను వివరించారు. అలాగే జాతీయ రాజకీయాలపై కూడా ఈ సమావేశంలో వివరించినట్లు సమావేశం అనంతరం టిఆర్‌ఎస్ నాయకులు చెప్పారు. సుమారు నాలుగు గంటలపాటు సిఎం కెసిఆర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భోజనాల అనంతరం కూడా సమావేశం జరిగింది. నాయకులు అనేకమంది సిఎం కెసిఆర్‌తో సమావేశమయ్యారు. అనేక వినతిపత్రాలను సమర్పించారు. ఉదయం 11.50 నిమిషాలకు టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి సిఎం కెసిఆర్ చేరుకొని రిజిష్టర్‌లో సంతకం చేశారు. ఆనంతరం రాష్ట్ర హోంశాఖమంత్రి మహమూద్ అలీ ముస్లీం మతవిశ్వాసాల మేరకు దట్టీ కట్టి ఆహ్వానించారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయ రెడ్డి సిఎం కెసిఆర్‌కు బొట్టుపెట్టి స్వాగతం పలికారు. ఆనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ విస్తృతస్థాయి సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు.

బాబూ మోహన్ ప్రస్తావన

టిఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ టిఆర్‌ఎస్ నేత బాబు మోహన్ ప్రస్తావనను సిఎం కెసిఆర్ తీసుకు వచ్చారు. బాబు మోహన్‌కు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోవడంతోనే ఆందోల్ టిక్కెట్ జర్నలిస్టు ఉద్యమకారుడు క్రాంతి కి ఇచ్చినట్లు చెప్పారు. క్రాంతి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. నియోజక వర్గంలో బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. శాసన సభ్యులు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకుని ఎదగాలని సిఎం కెసిఆర్ చెప్పారు.

KCR Meeting With Party Leaders On Municipal Elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News