Sunday, May 5, 2024

ఔరా.. నీరా

- Advertisement -
- Advertisement -

ktr

విదేశీ పెట్టుబడుదారులకు రుచి చూపిస్తా

గీత కార్మికులకు వాహనాల పథకం తెస్తాం,  రెండవ నీలి గులాబీ శ్వేత విప్లవాల సాధనలో కెసిఆర్ తలమునకలై ఉన్నారు
– గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : శతాబ్దాల గ్రామీణ వ్యవస్థలో అనేక కులవృత్తు లు వర్థిల్లుతున్నాయని రాష్ట్ర ఐటి, పారిశ్రామిక శాఖమంత్రి కెటిఆర్ చెప్పారు. అయితే నేడు ప్ర పంచదేశాలు వృత్తినైపుణ్యతకు శిక్షణలు అంటున్నాయన్నారు. వందల సంవత్సరాల క్రితం నుం చి తెలంగాణలో అభివృద్ది చేందిన కులవృత్తుల ను ప్రోత్సహిస్తే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయని కెటిఆర్ చెప్పారు. కులవృత్తులు అభివృద్ధి చెందితే ఆర్థిక వ్యవస్థకూడా అభివృద్ధిసాదిస్తుందన్నారు. శనివారం జలవిహార్‌లో గౌడ స ంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కెటిఆర్ మా ట్లాడుతూ గౌడ నాయకుల సూచనమేరకు గౌడన్నలు అర్థిక చోదక శక్తిగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోయో బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతితో కల్లుగీత కార్మికులకు లూనావాహనాలను పంపిణీ పథకం ప్రారంభించనున్నట్లు కెటిఆర్ ప్రకటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నె ముకగా ఉన్న కులవృత్తులను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి అనేక పథకాలను అమలు చేస్తున్నారని  చెప్పారు. నాలుగు విప్లవాలు సాధించేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారు

ముఖ్యమంత్రి కెసిఆర్ నాలుగు విప్లవాల సాధనలో నిమగ్నమయ్యారని కెటిఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక ప్రాజెక్టులు నిర్మించి రెండవ హరితవిప్లవం సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. మత్సకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నీలి విప్లవం, మాంస ఉత్పత్తులను పెంచేందుకు గులాబి విప్లవం, పంటలతో పాటు పాడిని వృద్ధి చేసేందుకు శ్వేత విప్లవం సాధించేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సిరిసిల్ల తదితర జిల్లాల్లో పచ్చని పంటపొలాలు దర్శనమిస్తున్నాయని చెప్పారు. అలాగే మత్యకారుల కోసం చేపల పెంపకం, కురుమ, గొల్లల కోసం గొర్రెల పెంపకం ప్రారంభించడంతో ఆకులాల్లో ఆర్థిక శక్తి పెరుగుతుందన్నారు. కాళేశ్వరం పై ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయితే పాడిని పెంచి పాల ఉత్పత్తులు గణనీయంగా పెరుగనున్నాయని చెప్పారు. కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే సిఎం కెసిఆర్ లక్షమన్నారు.

విదేశీయులకు నీరా తాగిస్తా

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృషి మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ నీరా పాలసీని తీసుకువచ్చారని చెప్పారు. ఈ ఆత్మీయ సభలో నీరా రుచి చూశానని, ఆ రుచిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న విదేశవ్యాపారులకు చూపిస్తానని కెటిఆర్ చెప్పారు. ఆరోగ్యవంతమైన నీరా ఉత్పత్తులకు రాష్ట్రం కేంద్రం కానుందని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సాగునీరు పుష్కలంగా లభించడంతో నీరా ఉత్పత్తులు కూడా పెరుగుతాయని ఆయన చెప్పారు. దేశరాజకీయాలపై కల్లుకంపౌండ్‌ల్లో నిర్ణయాలు జరుగుతాయన్నారు. కల్లు కంపౌండ్‌ల్లో గ్రామీణ ప్రజలు కూర్చొని దేశరాజకీయాలను విశ్లేషిస్తారని చెప్పారు. కల్లుగీత కార్మికుల కోసం చెట్టుకు పన్నును రద్దుచేసిన గొప్పతంనం టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కోకపేటలో గౌడ ఆత్మీయ భవన నిర్మాణం కోసం స్థల కేటాయింపు జరిగిందని ఆయన గుర్తు చేశారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు గౌడులు చేసిన ఉద్యమం చరిత్రలో మిగిలి పోతుందన్నారు. కులవృత్తులను కాపాడుతూ, ఆవృత్తులమీద ఆధారపడినవారిని ఆర్థికంగా ప్రోత్సహిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర సంపద పెంచుతూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పంచుతుందన్నారు. కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్షమన్నారు.

ఈ మేరకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగేఉన్నత విద్యకు గ్రామీణ ప్రజలకు అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలో 700ల గురుకుల పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఒక సారి స్కిల్ డెవెలఫ్ మెంట్ కేంద్రాలు పెట్టాలని సిఎం కెసిఆర్‌ను అడిగాను అయితే ఇప్పటికే ఉన్న డెవెలఫ్‌మెంట్ స్కిల్ సంగతేమిటని సిఎం ప్రశ్నించారని చెప్పారు. శతాబ్దాల క్రితం నుంచి గ్రామీణ వ్యవస్థలో వృత్తి నైపుణ్యత ఉంది దానిని ప్రోత్సహించాలే కానీ నేల విడిచి సాము చేయవద్దని సిఎం చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చి పోలేనని కెటిఆర్ చెప్పారు.

తెలంగాణలో ఉన్న కల వృత్తులను మరింత ప్రోత్సహిస్తూ పరిశ్రమల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒకప్పుడు తెలంగాణ ఏర్పడితే మీకు పాలించడం చేతకాదన్నా నాటి ఏపి సిఎం ఇప్పుడు హాట్సాప్ కెసిఆర్ అంటున్నారని ఆయన చెప్పారు. ఈసమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర శాసనమండల ఛైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్, శాసనభ్యుడు కెపి. వివేకానంద గౌడ్, మాజీ ఎంపి బూరనర్సయ్య గౌడ్, మాజీ అధికారి కొడిశల రాజేందర్ గౌడ్, నాయకులు బాలస్వామిగౌడ్, రాజలింగం గౌడ్, రాష్ట్రంలో జిల్లాల నుంచి వచ్చిన గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

KTR Participating in goud Atmiya Sammelana Mahotsavam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News