Friday, May 2, 2025

ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలోని రాయగఢ్‌జిల్లాలో తమ్హాని ఘాట్ ప్రాంతంలో శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడి ఇద్దరు మరణించగా, 55 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. స్థానిక పోలీస్‌లు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

రాయ్‌గఢ్ జిల్లాలో కొండలు, ఘాట్ మార్గం, రోడ్లు అధ్వాన్నంగా ఉండడంతో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 42 మందితో వెళ్తున్న బస్సు లోయలోపడి మొత్తం 13 మంది మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News