Friday, April 19, 2024

రాయదుర్గం గ్యాస్ సబ్‌స్టేషన్‌తో 2వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

- Advertisement -
- Advertisement -

2 thousand MW power generation with Rayadurg gas substation

 

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రాయదుర్గంలో నిర్మించిన గ్యాస్ సబ్‌స్టేషన్‌తో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటగా నిర్మించిన గ్యాస్ ఇన్స్‌లేటెడ్ 400 కెవి రాయదుర్గం సబ్‌స్టేషన్‌ను మంత్రి సందర్శించడంతో పాటు పనులను పరిశీలించారు. సబ్‌స్టేషన్‌ను త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభిస్తారని మంత్రి పేర్కొన్నారు. నగరంలో రానున్న 30, 40 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రూ.1400 కోట్ల వ్యయంతో ఈ గ్యాస్ ఇన్స్‌లేటెడ్ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా మోనో పోల్స్ కూడా మనమే వాడుతున్నామని టిఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరిగిందని, పనులు కూడా చాలా వేగంగా జరిగాయన్నారు. కొవిడ్‌తో పాటు అనేక ఆటంకాలను తట్టుకొని పనులు పూర్తి చేసినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.

గ్యాస్ ఇన్స్‌లేటెడ్ సబ్‌స్టేషన్..

సబ్‌స్టేషన్‌ల నిర్మాణం ఒకే ప్రాంతంలో చేయడమనేది దీని ప్రత్యేకత అని ఇది గ్యాస్ ఇన్స్‌లేటెడ్ సబ్‌స్టేషన్ అని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఈ నాలుగు సబ్‌స్టేషన్లు రావాలంటే దాదాపు 100 ఎకరాల స్థలం అవసరం అవుతుంది,కానీ, నగర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 5 ఎకరాల్లోనే సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు మంత్రి -జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇది ప్రారంభం అయితే నగరానికి విద్యుత్ వలయం ఏర్పాటు అయినట్టేనని, దీంతో ఒక్క క్షణం కూడా కరెంట్ పోదన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ 400 కెవి సబ్ స్టేషన్‌లు, 220 కెవి, 133 కెవి, 33 కెవి సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. నాలిగింటిని ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం దీని ప్రత్యేకతగా ఆయన పేర్కొన్నారు. ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్‌కు 3 కిలోమీటర్లు కేబుల్స్ అండర్ గ్రౌండ్ నుంచి ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మొక్కలు నాటారు. మంత్రి జగదీశ్ రెడ్డి వెంట టాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు, టిఎస్‌ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News