Monday, May 13, 2024

రాష్ట్రంలో కొత్తగా 20కెజిబివిలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కెజిబివి)లు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా మరో 20 కెజిబివిలు మం జూరు చేస్తూ మంగళవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 20 కెజిబివిల ఏర్పాటుకుగాను వార్షిక రికరిం గ్ బడ్జెట్‌గా రూ. 60 లక్షలను సైతం మంజూరు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల విభజనతో రాష్ట్ర ప్రభుత్వం పలు మండలాలను విభజించి కొత్త మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా కొత్త మండలాల్లో కెజిబివిలను ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో 20 కెజిబివిలను నెలకొల్పాల్సి ఉండగా.. వాటి కోసం రాష్ట్ర ప్రభు త్వం ప్రతిపాదనలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో కొత్తగా 20 కెజిబివిల ఏర్పాటు కు ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014లో రాష్ట్రంలో కేవలం391కెజిబివిలు ఉంవడగా,2017 18 లో కొ త్తగా 84 కెజిబివిలను ప్రభుత్వం మం జూరు చేసింది. దీంతో రాష్ట్రంలో కెజిబివిల సం ఖ్య 475కి చే రింది. తాజాగా మరో 20 కెజిబివిలు మంజూరు చేయడంతో వీటి సంఖ్య 495 కు చేరింది. వీటిల్లో  245 కెజిబివిల్లో ఇంటర్, మరో 230 కెజిబివిలను పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. కొత్తగా కెజిబివిలు ఏర్పాటు కానున్న మండలాలు మావల (ఆదిలాబాద్), బీర్పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్‌నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి ఘన్‌పూర్, మాసాయిపేట (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద,మోగుదంపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, చౌట్కూరు (సంగారెడ్డి), దూల్మెట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్).

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News