Saturday, April 27, 2024

24గంటల కరెంటు.. చెరువుల్లో పుష్కలనీరుతో జాదూలా పంటలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : 24గంటల కరెంటు చెరువుల్లో పుష్కలనీరుతో రైతులు జాదూచేసినట్లు పండుగాల వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగ భూదాన్‌పోచంపల్లి పరిధిలోని జలాల్‌పూర్ రైతువేదికలో శనివారం వ్యవసాయ, పంచాయతిరాజ్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుదినోత్సవ వేడుకలో ముఖ్యఅతథిగా హాజరై మాట్లాడారు.

వ్యవసాయం పండుగాలా జరగాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ కన్నకళల మేరకు నాడు మోదుగు చెట్లతో నిండిన బీడుభూములు నేడు పచ్చదనంతో విరాజిల్లడం నిదర్శమని తెలిపారు. రాష్ట్రంలో పెద్దయెత్తున చెరువుల పునరుద్దరణ, ప్రాజెక్టుల్లో నీటితో భూగర్బంలో నీరు పెరిగి పండుగామారిన వ్యవసాయాన్ని రైతులు మరింత కృషిచేసి మహోత్సవంగా మార్చి వ్యవసాయ అధికారుల సూచనలో ఆధునిక పద్దతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలన్నారు.

జిల్లాలో 12300మెట్రిక్‌టన్నుల బాయిల్డ్ రైస్‌కు అనుమతి వుందని దాన్ని 20వెయిల మెట్రిక్‌టన్నుల పెంచాలని కోరామని, సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని, వారం లోపు ధాన్యం కొనుగోల్లు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. కాగా మండలంలోని పిలాయిపల్లి, జూలూరు, పెద్దరావులపల్లి, ఇంద్రియాల, భీమనపల్లి, జిబ్లక్‌పల్లి లోగల రైతువేధికలలో రైతుదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈకార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్‌తివారీ, డిసిపి రాజేష్‌చంద్ర, జిల్లావ్యసాయఅధికారి అనురాధ, పంచాయతి అధికారి సునంద, ఎంపిపి మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పిటిసిసభ్యులు కోట పుష్పలతమల్లారెడ్డి, వైస్‌ఎంపిపి పాక వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మిశ్రీనివాస్, పిఎసిఎస్ అధ్యక్షులు కందాడి భూపాల్‌రెడ్డి, జలాల్‌పూర్ సర్పంచ్ పర్నె రజిత మల్లారెడ్డి, జిల్లా రైతుబంధు సమితిగోరంటి శ్రీనివాస్‌రెడ్డి,రావుల శేఖర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ కందాల సుధాకర్‌రెడ్డి, మండల వ్యవసాయఅధికారి ఎజాజ్‌అలీఖాన్, తహసిల్దార్ వీరాభాయి,ఎంపిడిఒ బాలశంకర్, ఆర్‌ఐ గుత్త వెంకట్‌రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు పాటి సుధాకర్ రెడ్డి,కార్యదర్శి చిలువేరు బాల్ నర్సింహా అయా గ్రామాల రైతులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News