Friday, June 2, 2023

2029 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో డిజిటల్ సెక్టార్ కీలకపాత్ర పోషిస్తుందని ప్రముఖ బ్యాంకర్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్(ఎన్‌ఎబిఎఫ్‌ఐడి) చైర్మన్ కెవి.వి.కామత్ అన్నారు. అలాగే 202829 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ ఆర్థిక వ్యవస్థ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం డిజిటల్ ఎకానమీ భారత్ జిడిపిలో 4 శాతమే ఉందని, ఇది చైనాలో 40 శాతంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం, విధానకర్తలు 202829 నాటికి భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూస్తారు.

ప్రస్తుతం భారత్ ఉన్న 3.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, జిడిపిలో జపాన్ దేశాన్ని భారత్ అధిగమిస్తుందని కామత్ అన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇకామర్స్, ఇతర డిజిటల్ పేమెంట్లు, సేవల రంగాలతో కూడిన డిజిటల్ ఎకానమీ భారతదేశం జిడిపి వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయని, ఈ రంగం జిడిపికి 25 శాతం దోహదం చేస్తుందని, 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను 2029 నాటికి చూస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం డిజిటల్ ఎకానమీ వాటా భారత్‌లో 4 శాతమే ఉందని ఆయన మీడియా ఇంటర్వూలో అన్నారు. ఈ రోజు చైనా జిడిపిలో డిజిటల్ ఎకానమీ 40 శాతం వాటాను కల్గివుందని, భారత్ ఇది సాధింకపోవడానికి కారణం కనిపించడం లేదని కామత్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News