Saturday, April 20, 2024

బెలూచిస్తాన్ లో మంచు తుఫాన్ బీభత్సం…. 31 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో మంచు తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. బెలూచిస్తాన్ లో మంచు తుఫాన్ ధాటికి ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. మృతులలో మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం. జోబ్ జిల్లాలోని షాహబ్ జాయ్ ప్రాంతంలో పైకప్పు కూలిపోవడంతో ఆరుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పాక్- ఆఫ్ఘానిస్తాన్ లోని చమాన్ ప్రాంతంలో మంచు ఇంటి పైకప్పు పై  భారీగా మంచు ఉండడంతో ఇల్లు కూలిపోయాంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.  ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకి పడిపోయాయి. క్వెట్టా నగరంలో ఇండ్లలో వ్యాపార సంబంధిత పనులు చేసుకునే వారికి విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచుతో కురుస్తున్న వర్షంతో ప్రజలు బయటకి రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. గతంలో కంటే కూడా ప్రస్తుతం వస్తున్న మంచు వర్షం తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తోందని స్థానిక మీడియా వెల్లడించింది. మంచు తుఫాన్ ధాటికి బెలూచిస్తాన్ లో ప్రతి సంవత్సరం 700 మంది పైగా చనిపోతారని ప్రభుత్వం తెలిపింది.

31 Members Dead in snowfall wreak in Balochistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News