Friday, June 2, 2023

రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/చారకొండ/ మానకొండూరు: నాగర్ కర్నూల్, కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కడప దర్గాకు వెళ్లి తిరిగివస్తూ నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం తుర్కలపల్లి గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తాపడటంతో నలుగురు మృతి మరో ఘటనలో కరీంనగర్ నుంచి మానకొండూరు వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న మరో బస్సు కిందపడి తల్లికొడుకు చనిపోయారు. ఈ సంఘటనలకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల గ్రామాలకు చెందిన సమీప బంధువులు కడప దర్గాకు వెళ్లి తిరిగివస్తుండగా శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వస్తూ రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మను ఢీకొని బోల్తాపడటంతో ఈ ఘటన చోటుచేసుకొంది. ప్రమాదంలో నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన తల్లికొడుకులు సయ్యద్ రోషన్ జమీర్(25), సయ్యద్ సాధిక(55), సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన కుటుంబసభ్యులు షేక్ గౌస్‌ఖాన్(45), షేక్ ఫర్హద్(40), షేక్ ఇంతియాజ్(25)లు కడప దర్గాకి వెళ్లి తిరిగి వస్తుండగా ఉదయం ఆరు గంటల ప్రాంతంలో చారకొండ మండలం తుర్కపల్లి గ్రామం సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మకు ఢీకొని బోల్తా పడింది. వాహనంలో ఉన్న సయ్యద్ రోషర్ జమీర్, సయ్యద్ సాధిక, షేక్ ఫర్హాద్, షేక్ గౌస్‌ఖాన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక ప్రయాణికుడు ఇంతియాజ్ తలకు తీవ్రగాయాలు కావడంతో మైరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పక్కనే ఉన్న తుర్కపల్లి గ్రామస్థుల సహాయంతో కారు నుంచి బయటకు తీసి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరో ఘటనలో.. మానకొండూర్‌కు చెందిన ఎనగందుల అంజయ్య, అతని భార్య సౌజన్య(30), కుమారుడు ఎనగందుల యశ్వంత్, కూతురు అశ్విత(5)లు బైక్‌పై కరీంనగర్ నుంచి మానకొండూరు వస్తుండగా.. చెరువుకట్ట వద్ద బైక్ హన్మకొండకు చెందిన బస్సును ఓవర్‌టేక్ చేయబోతుండగా బస్సుకు బైక్ హ్యాండిల్ తగలడంతో బైక్‌పై ఉన్న నలుగురు కిందపడిపోగా, ఎదురుగా వస్తున్న నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సౌజన్య, యశ్వంత్‌పై నుంచి వెళ్లడంతో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. అంజయ్యతో పాటు అతని కూతురు అశ్విత తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, తల్లి, కొడుకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

4 Killed in Car Accident in Nagarkurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News