Thursday, April 25, 2024

10 రంగాల్లో 42,000 ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

విజయవంతంగా ముగిసిన మంత్రి కెటిఆర్ రెండు దేశాల పర్యటన
రెండు వారాలు.. 80 వ్యాపార సమావేశాలు, ఐదు రౌండ్ టేబుల్ సమావేశాలు, రెండు భారీ సమావేశాలు
టైప్2 నగరాలకు ఐటి కంపెనీల విస్తరణ, కాళేశ్వరానికి అంతర్జాతీయ గుర్తింపు
పర్యటన ముగిసిన అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణకు పె ట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చేపట్టిన ఇంగ్లాండ్, అమెరికా దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు వారాల ఈ పర్యటనలో వివిధ కంపెనీల యాజమాన్యాలతో 80కి పైగా సమావేశాలు, ఐదు రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు రెండు కాన్ఫరెన్స్‌లలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. స్టా ర్టప్ స్టేట్‌గా తొమ్మిదేళ్లలోనే ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందు కు దిగ్గజ అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపించాయి. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో భాగం అయ్యేందుకు సంతోషంగా ముందుకువచ్చాయి. మంత్రి కెటిఆర్‌తో సమావేశాల తరువాత తెలంగాణలో తమ పెట్టబడి, విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి.

వివిధ రంగాల్లో రాబోయే ఈ పెట్టుబడులతో రానున్న కాలంలో తెలంగాణలో సుమారు 42వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడుతా యి. పర్యటన సందర్భంగా ఇంగ్లాండ్‌లోని లండన్, అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, హ్యూస్టన్, హెండర్సన్, బోస్టన్‌లలో 80కి పైగా స మావేశాలకు మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఐటి, ఐటి ఆధారిత రంగాలు, మీడియా, ఎంటర్ టైన్ మెంట్, ఏరో స్పెస్, రక్షణ, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైజెస్, డిజిటల్ సొల్యూషన్స్, ఇన్నోవేషన్, డేటా సెంటర్, ఆటోమోటివ్, ఇ.వి. రంగాల్లో తె లంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీలను కెటిఆర్ ఒప్పించారు.

అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పెట్టుబడులకు తెలంగాణే గమ్యస్థానం అన్న సంగతి కెటిఆర్ పర్యటనతో మరోసారి రుజువైంది. వినోద రంగంలో అగ్రగామి సంస్థ ఐన వార్నర్ బ్రదర్స్- డిస్కవరీ, హెల్త్ కేర్ టెక్నాలజీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్ ట్రానిక్, ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడుల సంస్థ స్టేట్ స్ట్రీట్, బైన్ క్యాపిటల్ కు చెందిన వీఎక్స్ ఐ గ్లోబల్ సొల్యూషన్స్‌తో పాటు లండన్ స్టాక్ ఎక్సేంజ్ గ్రూప్ కంపెనీలు తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగం అయ్యేందుకు ముందుకొచ్చాయి. ఆయా కంపెనీల పెట్టుబడి ప్రకటనలతో 42,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఓ వైపు వ్యాపార, వాణిజ్య సంస్థలతో సమావేశాలకు హాజరవుతూనే మరోవైపు తెలంగాణ విజయగాథను మంత్రి కెటిఆర్ వినిపించారు.

మే 12న లండన్ లో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సుకు హాజరైన కెటిఆర్, తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు ఇక మే 22 న అమెరికా నెవాడాలోని హెండర్సన్‌లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహించిన ప్రపంచ పర్యావరణ మరియు జలవనరుల కాంగ్రెస్‌లో మంత్రి కెటిఆర్ కీలకోపన్యాసం చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల విజయగాథను అమెరికన్ ఇంజనీర్లకు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు అమెరికన్ సివిల్ ఇంజనీర్ల సంఘం ప్రకటించిన ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్ అండ్ పార్టనర్‌షిప్’ అవార్డును అందుకున్నారు. యూకే, యుఎస్ పర్యటనలో మంత్రి కెటిఆర్ ఐదు రౌండ్ టేండ్ సమావేశాల్లో పాల్గొన్నారు.

కెటిఆర్‌తో సమావేశం తరువాత తెలంగాణలోని టైర్-2 నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వచ్చాయి. 30కి పైగా కంపెనీల సిఇఒలతో కెటిఆర్ సమావేశమై టైర్-2 నగరాల్లో ఐటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేలా ఒప్పించారు. మంత్రితో పాటు ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ విష్ణు వర్ధన్ రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్, దిలీప్ కొణతం, తెలంగాణ లైఫ్‌సైన్సెస్ సిఇఒ శక్తి ఎం నాగప్పన్, ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ ,పి.ఎ. చీఫ్ రిలేషన్షిప్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఆత్మకూరి, ఐపిఒ, ఇన్వెస్ట్ తెలంగాణ, వెంకట శేఖర్ ఈ పర్యటనలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News