Friday, April 26, 2024

ఎంసెట్‌లోనూ అమ్మాయిలదే హవా!.. ర్యాంకుల్లో మాత్రం అబ్బాయిలకే

- Advertisement -
- Advertisement -

ర్యాంకుల్లో మాత్రం అబ్బాయిలకే అగ్రస్థానం, ఇంజినీరింగ్‌లో అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 82.7, అగ్రికల్చర్‌లో 87.02
బాలురలో ఈ శాతం 79.21, 84.63 మాత్రమే ఇంజినీరింగ్ టాప్10లో ఏడుగురు బాలురే, అగ్రికల్చర్‌లో 8మంది అబ్బాయిలే, ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కు నిర్వహించిన టిఎస్ ఎంసెట్ 2023 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణత శాతం విషయంలో అమ్మాయి లదే పైచేయి కాగా, టాప్ టెన్ ర్యాంకు ల్లో అబ్బాయిలకే అత్యధిక స్థానాలు ద క్కాయి. అధికారిక వెబ్‌సైట్ https: //eamcet.tsche.ac. in/ ఎంసెట్ ఫలితాల్లో నూ అమ్మాయిల హవా కొనసాగింది. ఇంజినీరింగ్ విభాగంలో 82.07 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, 79.21 శాతం బా లురు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 87.02 శాతం బాలికలు, 84.63 శాతం బాలురు అర్హత పొందారు.

ఇంజినీరింగ్ విభాగంలో 80.33 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, అగ్రికల్చర్, ఫార్మ సీ విభాగంలో 86.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎంసెట్‌లో ఇంజినీరింగ్ విభాగంలో 1,95,275 మంది విద్యార్థులు హాజరుకాగా, 1,56,879 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 విద్యార్థులు హాజరు కాగా, 91, 935 మంది ఉత్తీర్ణత సాధించారు. గురువారం మాసబ్ ట్యాంక్‌లోని జెఎన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, జెఎన్‌టియుహెచ్ వైస్ ఛాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ బి.డీన్‌కుమార్, కో కన్వీనర్ కె.విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నా రు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 3,20,683 మం ది విద్యార్థ్ధులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోగా, 94.85 శాతం హాజరు నమోదైంది. 21 జోన్లలో తెలంగాణలో 104 కేంద్రాలలో, ఎపిలో 35 కేంద్రాలు మొత్తం 137 కేంద్రాలలో ఎంసెట్ పరీక్షను నిర్వహించారు. ఈనెల 10 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్షలు జరిగాయి.

ఇంజినీరింగ్ ఫస్ట్ ర్యాంకర్‌కు 158.898 మార్కులు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన సనపాల అనిరుధ్ 160 మార్కులకు 158.898 మార్కులు సాధించి ఇంజినీరింగ్ వి భాగంలో మొదటి ర్యాంకు సాధించారు. ఎపిలోని గుంటూరుకు చెందిన యక్కంటి పాణి వెంకట మనీందర్‌రెడ్డి 158.591 మార్కులతో రెండో ర్యాంకు, కృష్ణా జిల్లా నందిగామకు చెందిన చల్ల ఉమేష్ వరుణ్ 156.942 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు అగ్రికల్చర్ విభాగంలో బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్ 155.008 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించారు. నాసిక వెంకటతేజ 154.601 మార్కులతో ద్వితీయ ర్యాంకు, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన సఫల్ లక్ష్మి పసుపులేటి 154.520 మార్కులతో మూడవ ర్యాంకు సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News