Saturday, July 27, 2024

పాక్ డ్రగ్ స్మగ్లర్ల అరెస్టు.. రూ.175 కోట్ల హిరాయిన్ సాధీనం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోకి రూ.175 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేయడానికి యత్నించిన పాక్ దేశస్థులు ఐదుగురిని తీర రక్షణ దళం సోమవారం ఉదయం పట్టుకుంది. అహ్మదాబాద్‌కు 440 కిమీ దూరంలో కచ్ జిల్లా జఖాయు తీరం వద్ద సముద్రం మధ్యలో చేపలబోటుపై వీరు ఉంటుండగా ఈ అరెస్టు జరిగిందని, ఒక్కొక్కటి కిలో బరువున్న మొత్తం 35 ప్యాకెట్ల హిరాయిన్ ను నిందితుల నుంచి సాధీనం చేసుకున్నట్టు భారత తీర రక్షణ గార్డు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ 35 ప్యాకెట్ల విలువ రూ.175 కోట్లు ఉంటుంది. పట్టుబడిన నిందితులు అనీస్ ఇసా భట్టి( 30), ఇస్మాయిల్ మొహమ్మద్ కుచ్చి (50),అష్రాఫ్ ఉస్మాన్ కుచ్చి(42), కరీం అబ్బుల్లా కుచ్చి (37), అబూబకర్ అష్రఫ్ సుమ్రా (55). వీరంతా కరాచీ నివాసులు.

5 Pak Drags smugglers arrested in Ahmedabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News