Friday, March 29, 2024

ఈ ఎన్నికల్లో విపక్షాల డిపాజిట్లు గల్లంతే

- Advertisement -
- Advertisement -

deposits

 

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా ఆర్‌ఎంపి, పిఎంపిల సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ముఖ్య అతిదిగా హాజరైన హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో గ్రామీణ వైద్యులతో 15 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. ఉద్యమ సమయంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో వారి పాత్ర కీయాశీలకంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్న సేవలు మరువలేనివని చెప్పారు. సిఎం కెసిఆర్ వారి సేవలను గుర్తించి దృవీకరణ పత్రం ఇచ్చేందుకు సిద్దం కాగా.. కొంతమంది పథకం ప్రకారం జిఒను అడ్డుకున్నారన్నారు. అయినప్పటికీ.. వారి సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తామని, తెలంగాణ సాధించుకున్నందున బంగారు తెలంగాణను సాధించాలన్నది సిఎం కెసిఆర్ కల అని చెప్పారు.

నారాయణ్‌ఖేడ్ ప్రాంతంలో ఎస్టీలు ఎక్కువగా ఉంటారని, అక్కడ పిల్లలు చదువుకోవడానికి ఒక్క రెసిడెన్షియల్ పాఠశాల కూడా లేదని, అలాంటిచోట తాము అధికారంలోకి వచ్చాక ఐదు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా గ్రామీణ వైద్యులు సహకారం అందించి తెరాస గెలుపునకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మాజి ఎమ్మెల్యే సత్యనారాయణ, గ్రామీణ వైద్యుల సంఘ నేతలు పాల్గొన్నారు.

No deposits for opposition in this election
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News