Saturday, April 27, 2024

హాంకాంగ్‌కు రూ.1038 కోట్ల నల్లడబ్బు చెల్లింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2014-15లో రూ.1038 కోట్ల నల్లడబ్బును 48 సంస్థలకు చెందిన 51 కరెంటు అకౌంట్ల ద్వారా హాంకాంగ్‌కు చెల్లించినట్టు సిబిఐ గుర్తించింది. ఈ సంస్థల్లో ఎక్కువ సంస్థలు చెన్నైకు చెందినవారిగా బయటపడినట్టు సిబిఐ అధికారులు సోమవారం వెల్లడించారు. బ్యాంకు ఆఫ్ ఇండియా, ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులకు చెందిన గుర్తు తెలియని అధికారుల ద్వారా ఈ హవాలా వ్యవహారం సాగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సంస్థలు ఈ బ్యాంకుల నాలుగు బ్రాంచీల ద్వారా అకౌంట్లు తెరిచి మొత్తం లావాదేవీలను సాగించాయి. ఈ చెల్లింపు మొత్తం రూ.1038.34 కోట్లలో అమెరికా డాలర్లతో సమానమైన రూ.488.39 కోట్లు 24 అకౌంట్ల ద్వారా సరకుల దిగుమతుల కోసం అడ్వాన్సుగా విదేశీ సంస్థలకు చెల్లించగా, మిగతా రూ.549.95 కోట్లు భారత టూరిస్టులకు విదేశీ పర్యటన కోసం 27 అకౌంట్ల ద్వారా చెల్లించారు.

CBI Find Rs1038 Cr black money transferring to Hong Kong

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News