Wednesday, April 24, 2024

త్వరలో మార్కెట్లోకి 5జి ఫోన్లు!

- Advertisement -
- Advertisement -

5G

 ధర రూ.35 వేల పైమాటే
మరో ఏడాది దాకా ధరలు తగ్గే అవకాశాలు లేవంటున్న టెక్ ఆర్క్

న్యూఢిల్లీ: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 4 జి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల నాణ్యత ఎలా ఉన్నప్పటికీ 5 జి సేవలను ప్రవేశ పెట్టడానికి టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. మరో వైపు మొబైల్ తయారీ కంపెనీలు కూడా 5జి స్మార్ట్ ఫోన్లను తయారు చేయడం మొదలు పెట్టాయి.ఈ క్రమంలోనే ఆ ఫోన్లు త్వరలోనే మార్కెట్లోకి రానున్నప్పటికీ సామాన్య వినియోగదారుడికి మాత్రం నిరాశనే మిగల్చనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో ఫోన్ల తయారీ కంపెనీలు దాదాపు 15 దాకా 5జి స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తాయని రిసెర్చ్ సంస్థ టెక్ ఆర్క్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఆ ఫోన్ల ధరలు రూ.35 వేలకు పైగానే ఉంటాయని ఆ సంస్థ భావిస్తున్నది.

మన దేశంలో 4 జి స్మార్ట్ ఫోన్ల ధరలు రూ.6 వేలనుంచి ప్రారంభం అవుతుండగా,4జి పేవల వల్ల చాలా మంది ఆ ఫోన్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. అయితే 5 జి సేలను ఉపయోగించుకోవాలంటే.. కనీసం 35 వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.దీంతో అంత ఖరీదు పెట్టి సామాన్యులు ఆ ఫోన్లను కొనుగోలు చేయడం కష్టం గనుక వారికి ఈ విషయంలో కాస్త నిరాశ తప్పదని టెక్ ఆర్క్ సంస్థ భావిస్తోంది. దేశంలో ప్రస్తుతం రూ.10 వేలనుంచి రూ.20 వేల మధ్య ఖరీదు చేసే స్మార్ట్ ఫోన్లనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆ రేంజి 5జి స్మార్ట్ ఫోన్లు విడుదలైతే అటు మొబైల్ తయారీ కంపెనీలతో పాటుగా ఇటు టెలికాం కంపెనీలకు కూడా లాభదాయకంగా ఉంటుంది.

అయితే దీనికి వచ్చే ఏడాది దాకా వేచి ఉండాల్సి ఉంటుందని, అప్పటికి తక్కువ ధరకే 5జి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని ఆ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఈ ఏడాది మాత్రం 5 జి స్మార్ట్ ఫోన్ల కోసం ఎక్కువ మొత్తాన్నే ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆ సంస్థ అంటోంది. అంటే ధనవంతులకే ఇవి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అంత మోజుగా ఉంటే అప్పో, సప్పో చేసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎటాగూ చాలా ప్రము మొబైల్ సంస్థలు జీరో శాతం వడ్డీపై వాయిదాల పద్ధతిన మొబైల్ ఫోన్లను అందిస్తున్నందున కొంతమందయినా మధ్య తరగతి వారు ఈ 5జి స్మార్ట్ ఫోన్లను సొంతం చేసుకునే అవకాశాలు లేక పోలేదు. అందుకు మరో నాలుగైదు నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది.

 

5G Smartphones To Be Launched Soon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News