Saturday, April 20, 2024

నిధులు సేకరించనున్న భారతీ ఎయిర్‌టెల్

- Advertisement -
- Advertisement -

Airtel

ఈక్విటీ, డెట్ మార్గంలో 3 బిలియన్ డాలర్లు
నిధులు సేకరించనున్న భారతీ ఎయిర్‌టెల్

న్యూఢిల్లీ: ఈక్విటీల రూపంలో 2 బిలియన్ డాలర్లు, డెట్ మార్గంలో మరో 1 బిలియన్ డాలర్లు సేకరించడానికి భారతీ ఎయిర్‌టెల్ వాటాదారులు ఆమోదం తెలియజేశారు. శుక్రవారం జరిగిన అసాధారణ వాటాదారుల సమావేశంలో 2 బిలియన్ డాలర్ల దాకా సెక్యూరిటీలు జారీ చేయాలన్న ప్రతిపాదనకు 99.8 శాతం ఓట్లు లభించాయని కంపెనీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించిన ఒక నోట్‌ను లో పేర్కొన్నారు. అలాగే ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు, అన్ సెక్యూర్డ్/ సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయడానికి ఉద్దేశించిన మరో ప్రత్యేక తీర్మానానికి కూడా ఇంతే శాతం ఓట్లు లభించాయని భారతీ ఎయిర్‌టెల్ ఆ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 3న జరిగే ఇజిఎంలతో ఈ మేరకు వాటాదారుల ఆమోదాన్ని పొందుతామని కంపెనీ గత నెలలోనే తెలిపిన విషయం తెలిసిందే.

Airtel gets shareholders nod to raise up to $3 billion

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News