Sunday, April 28, 2024

బిజెపికి 3 సంస్థల విరాళాలు రూ. 349 కోట్లు

- Advertisement -
- Advertisement -

భారతీ ఎయిర్‌టెల్, దాని అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా సుమారు రూ. 235 కోట్లు విలువ చేసే ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేశాయని, వాటిలో ఒక్క రూపాయి తప్ప తక్కిన మొత్తాన్ని అధికార బిజెపికి విరాళంగా ఇచ్చాయని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన డేటా వెల్లడించింది. భారతీ ఎయిర్‌టెల్ సుమారు రూ. 197.5 కోట్లు బిజెపికి, రూ. 50 లక్షలు, జెకెలోని నేషనల్ కాన్ఫరెన్స్‌కు, రూ. 10 లక్షలు ఆర్‌జెడికి విరాళంగా ఇచ్చింది. సునీల్ మిట్టల్ సారథ్యంలోని టెలికమ్ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ అనుబంధిత భారతీ టెలిమీడియా బిజెపికి రూ. 37 కోట్లు విలువ చేసే బాండ్లను విరాళంగా ఇచ్చిందని ఇసి డేటా తెలియజేసింది.

కోటక్ ఇన్ఫినా ఫైనాన్స్ విరాళం రూ. 60 కోట్లు
అంతగా తెలియని ఎన్‌బిఎఫ్‌సి, కోటక్ కుటుంబ యాజమాన్యంలోని ఇన్ఫినా ఫైనాన్స్ రూ. 60 కోట్లు విలువ చేసే ఎలక్టొరల్ బాండ్లను బిజెపికి విరాళంగా ఇచ్చింది. ఇసికి ఎస్‌బిఐ అందజేసినడేటా ప్రకారం, ముంబయి కేంద్రంగా గల ఇన్ఫినా ఫైనాన్స్ 2019, 2020, 2021 సంవత్సరాలలో రూ. 1 కోటి డినామినేషన్‌లోఎలక్టొరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఆ బాండ్లు అన్నిటినీ బిజెపికి విరాళంగా ఇచ్చిందని డేటా తెలిపింది.

నవయుగ ఇంజనీరింగ్ విరాళం రూ.55 కోట్లు
హైదరాబాద్ కేంద్రంగా గల నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఇసి) రూ. 55 కోట్లు విలువ చేసే ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేసి ఆ మొత్తాన్ని బిజెపికి విరాళంగా ఇచ్చినట్లు ఇసి విడుదల చేసిన డేటా ద్వారా తెలియవచ్చింది. 2019 ఏప్రిల్ 19, 2022 అక్టోబర్10 మధ్య ఒక్కొక్కటి రూ. 1 కోటి విలువ చేసే 55 ఎలక్టొరల్ బాండ్లను ఎన్‌ఇసి కొనుగోలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News