Sunday, April 28, 2024

నా నియోజకవర్గంలో నారీ శక్తి ఏమిటో చూపించారు

- Advertisement -
- Advertisement -

దొంగపై పోరాటం చేసిన మహిళలను అభినందించిన బిజెపి ఎంపి అభ్యర్థి ఈటెల

మన తెలంగాణ/హైదరాబాద్:  ఓ ఇంట్లోకి దొంగతానికి ప్రవేశించినా దుండగులను తరిమేందుకు తల్లీకుమార్తెలు చేసిన విరోచిత పోరాటం స్ఫూర్తిగా నిలుస్తోంది. దుండగుడి చేతిలో తుపాకీ ఉన్నా ఏ మాత్రం వణుకూ బెణుకూ లేకుండా వారిద్దరూ ఎదిరించిన తీరు మహిళా శక్తిని మరోసారి చాటింది. వీరి ధైర్య సాహసాలను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. శుక్రవారం మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి ఈటెల రాజేందర్ మహిళలను సన్మానించి నారీ శక్తికి వందనం అంటూ కొనియాడారు.

నగర పోలీసులు కూడా వేగంగా స్పందించి పారిపోతున్న వారిని పట్టుకున్నారని వారికి అభినందనలు తెలిపారు. తెలంగాణ పోలీస్ అనేక విషయాల్లో నైపుణ్యం సంతరించుకున్న వారని మహానగరం పాలిటన్ సిటీ అని అనేక రాష్ట్రాల వారు ఇక్కడ జీవిస్తున్నారని, పటిష్ట భద్రత ఉన్నా ఇలాంటివి జరగడం బాధాకరమన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో కొంతమంది యువకులు ఆకతాయి పనులు చేస్తున్నారని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వం అలాంటివి జరగకుండా అరికట్టాలని కోరారు. నా పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వస్తుందని బాధ్యత గల వ్యక్తిగా వారికి భరోసా ఇవ్వడానికి వచ్చానని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News