Saturday, April 27, 2024

పార్టీ మారిన ఎంఎల్‌సిలపై అనర్హత వేటు వేయాలి

- Advertisement -
- Advertisement -

చైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిల ఫిర్యాదు

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంఎల్‌సిలు పట్నం మహేందర్ రెడ్డి, కూసుకుంట్ల దామోదర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్ శాసన సభాపక్షం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పిటిషన్ సమర్పించింది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు ఎంఎస్ ప్రభాకర్ రావు, యాదవ రెడ్డి, శేరి శుభాష్ రెడ్డి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయ కార్యదర్శి ఎం .రమేష్ రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసి పిటిషన్‌తో పాటు పలు ఆధారాలను సమర్పించారు.

ఈ సందర్భంగా ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు శాసన మండలి చైర్మన్‌ను కలిశామని అన్నారు. బిఆర్‌ఎస్ బీ ఫారం మీద ఎంఎల్‌సిలుగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన కె .దామోదర్ రెడ్డి, పి.మహేందర్ రెడ్డిలపై ఫిరాయింపు నిరోధక ఛట్ఠం ప్రకారం అనర్హత వేటు వేయాలని చైర్మన్‌కు సాక్ష్యాధారాలతో పిటిషన్ సమర్పించినట్లు పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిని ఉపేక్షింమని హెచ్చరించారు. చైర్మన్ తమ పిటిషన్‌పై సానుకూలంగా స్పందించి ఇద్దరు ఎంఎల్‌సిలపై అనర్హత వేటు వేస్తారని భావిస్తున్నామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News