Tuesday, April 30, 2024

విదేశీ కరెన్సీ పేరుతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఏడుగురు సభ్యులు ఉన్న ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7,47,000 నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఢిల్లీకి చెందిన ఎండి ఇమ్రాన్ షేక్, వాహిద్ షేక్, బీహార్ రాష్ట్రానికి చెందిన హసిం అలాం, కుల్‌సుమ్, మహ్మద్ అలీ షేక్, నిషా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షేక్ నిసార్ అహ్మద్ కలిసి మోసం చేస్తున్నారు. నిందితులు చిన్న వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నారు. ధిర్హాం కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి తక్కువ కమీషన్ తీసుకుని మార్చుతామని పలువురు అమాయకులకు వల వేస్తున్నారు.

తక్కువ కమీషన్‌కు వారి వద్ద ఇండియన్ కరెన్సీని తీసుకుని వారికి ధిర్హాం కరెన్సీని ఇస్తున్నారు. దిర్హాం కరెన్సీ కట్టపైన ఒరిజినల్ నోట్లను పెట్టి, లోపల న్యూస్‌పేపర్స్ కట్టింగ్‌లను పెడుతున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో వాటిని తీసి చూడవద్దని నిందితులు చెప్పడంతో బాధితులు వారి చెప్పినట్లు చేస్తున్నారు. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ఎస్సైలు అశోక్ రెడ్డి, గగన్‌దీప్, నవీన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News