Saturday, May 4, 2024

దేశంలో సరికొత్త నేరంశిక్ష చట్టాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో నేరం న్యాయం శిక్షలకు సంబంధించిన అత్యంత ప్రధాన అంశాల మూడు న్యాయసంహిత బిల్లులకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఐపిసి, సిఆర్‌పిసి, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. తరతరాల నాటి బ్రిటిష్ రాజరికం దశ నుంచి అమలులో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), నేరశిక్షా స్మృతి (సిపిఆర్‌సి), సాక్షాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్ట్)లకు బదులుగా ఇప్పుడీ బిల్లులను సభ ముందుంచారు. దీనిపై చర్చ తరువాత జరిగిన మూజువాణి ఓటింగ్‌లో ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టులోనే ముందుగా ఈ బిల్లులను కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ సభ ముందుకు తీసుకువచ్చింది. అప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఇప్పుడు వీటిని మరింత సమగ్రరీతిలో తీర్చిదిద్ది సభలో శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఓ వైపు ప్రతిపక్ష సభ్యులు పలువురిపై సస్పెన్షన్ల వేటుతో చర్చ ఆ తరువాత ఆమోద ప్రక్రియ దీనికి అనుగుణంగానే సాఫీగా సాగింది. దేశంలోని నేర తదనంతర న్యాయ చట్ట వ్యవస్థకు కాలానుగుణ రీతిలో , సమగ్ర మార్పులు అవసరం అని ప్రభుత్వం భావించిందని చర్చకు సమాధానం ఇస్తూ హోం మంత్రి అమిత్ షా తెలిపారు.

శిక్షల విధింపు క్రమంలో కేవలం మూల్యం చెల్లించుకోవల్సిందే అనే పద్థతి కాకుండా తగు విధంగా మానవీయ కేంద్రీకృత దృక్పథం ద్వారా న్యాయవితరణ జరగమే ప్రభుత్వ ఉద్ధేశమని అమిత్ షా తెలిపారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన న్యాయసంహిత శ్రేణి బిల్లుల్లో భారతీయ న్యాయ సంహిత(బిఎన్‌ఎస్), భారతీయ నాగరిక సురక్ష (రెండు) సంహిత ( బిఎన్,ఎన్‌ఎస్), భారతీయ సాక్ష (రెండు) (బిఎస్) బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు ప్రవేశపెట్టిన, తద్వారా రూపొందే చట్టాల ప్రకారం ఉగ్రవాదంపై నిర్థిష్ట నిర్వచనం ఖరారు అయింది. ఇప్పుడు చేసిన ప్రతిపాదనలతో దేశంలో ఇక నేరానికి శిక్షలపై కంటే నేరాలలో సంబంధిత పక్షాలకు తగు న్యాయంపైనే దృష్టి సారించడం జరుగుతుందని , అన్ని విషయాలను సమగ్ర రీతిలో పరిశీలించి , నిపుణులు, న్యాం చట్టం విశ్లేషకులను సంప్రదించి వీటిని తీసుకువచ్చినట్లు అమిత్ షా తెలిపారు. దేశద్రోహ నేరాల అభియోగాల విషయంలో వెనువెంటనే దీనిని నేరంగా పరిగణించకుండా , సంబంధిత చట్టంలో కొత్త సెక్షన్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వంపై దాడి యత్నం అనే ఈ సెక్షన్‌ను పొందుపర్చారు.తదనుగుణంగా శిక్షలు పడుతాయి. ఇప్పుడు ఉనన ఐపిసి, సిఆర్‌పిసి, సాక్షాధారాల చట్టం ఇవన్నీ కూడా వలసవాద ఆధిపత్య ధోరణి కొనసాగింపుగా ఉన్నాయని అమిత్ షా చెప్పారు.

బ్రిటిష్ పాలనా ఆలోచనా విధానం నుంచి భారతీయ యోచనల క్రమంలోకి , భారతీయ ప్రాతిపదికల పద్ధతిలోకి దారిమళ్లించేందుకు ఉద్ధేశించినవే అని తెలిపారు. ఇప్పుడు తీసుకువచ్చిన భారతీయ న్యాయసంహిత 1860 నాటి ఇపిసికి బదులుగా తెచ్చారు. కాగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 1973 నాటి సిఆర్‌పిసి ప్రత్యామ్నాయం అవుతుంది. 1872 నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఇకపై భారతీయ సాక్షా బిల్లు ద్వారా కొత్త చట్టం వస్తుంది. బ్రిటిష్ వారి పాలనలో జరిగిన ఉద్యమాలలో భాగంగా జరిగిన ఉద్యమకారుల చర్యలను నేరాల పరిధిలోకి తీసుకువచ్చేందుకు అప్పుడు కటుతరమైన చట్టాలను తీసుకువచ్చారని అమిత్ షా తెలిపారు. ఇప్పుడు మారిన వాతావరణానికి అనుగుణంగా చట్టాలను పునః సమీక్షించి ఈ కొత్త చట్టాలకు రూపకల్పన చేసినట్లు అమిత్ షా చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 22తో ముగుస్తాయి. బుధవారం దిగువ సభలో బిల్లులకు ఆమోదం దక్కడంతో ఎగువసభలో గురువారం వీటిని ఆమోదింపచేసుకుని, రాష్ట్రపతి సంతకంతో వెంటనే చట్టరూపంలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

మూకదాడి ఘటనల దారుణాలకు ఉరిశిక్ష
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు క్రిమినల్ బిల్లుల మేరకు ఇకపై మూకదాడుల పరిధిలో శిక్షను మరణశిక్షగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని, బిల్లులు తద్వారా రూపొందే చట్టాలలోని ప్రధానాంశాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు తెలిపారు. రాజద్రోహ చట్టం ఎత్తివేత జరుగుతుంది. అప్పుడు బ్రిటిషర్లు దీనిని అడ్డుపెట్టుకుని తమ సయ్యాటకు దిగినందున దీనిని ఎత్తివేసి, దీని బదులుగా సంబంధిత చర్యలను నేరాలుగా కాకుండా ఇతరత్రా పరిగణనలోకి తీసుకుని శిక్షించడం జరుగుతుందని అమిత్ షా వివరించారు. బ్రిటిషర్ల కాలంలోని రాజద్రోహ చట్టం సాకుగా తీసుకుని అప్పట్లో మహాత్మాగాంధీ , పటేల్, తిలక్ మహారాజ్ వంటివారిని ఏళ్ల తరబడి నిర్బంధంలోకి నెట్టారని అమిత్ షా చెప్పారు. మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా నిర్మూలించే నిర్ణయానికి దిగిందన్నారు.

పోలీసు జవాబుదారీతనం పెంపు
ఇప్పుడు తీసుకువచ్చిన మూడు క్రిమినల్ బిల్లులతో దేశంలో ఇకపై నేరాల విషయంలో పోలీసు వ్యవస్థ జవాబుదారితనం పెంపొందించే వాతావరణం ఏర్పడుతుందని అమిత్ షా తెలిపారు. ఇకపై తప్పనిసరిగా ప్రతి ఠాణాలో అరెస్టు అయిన వారి వివరాలను పోలీసులు పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ రికార్డులను నిర్వహించే బాధ్యతను సంబంధిత పోలీసు అధికారి విధిగా తీసుకోవాలి. బాధ్యతలు నిర్వర్తించాలి. అరెస్టు వివరాలు, రికార్డుల భద్రత ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసులపైనే ఉంటుంది. లేకపోతే ఈ వర్గాలు తగు శిక్షలకు గురవుతాయి. అక్రమరవాణాల చట్టాలను లింగ వ్యత్యాస్యాలు లేకుండా తటస్థం చేశారు.

18 ఏండ్లు లోబడ్డ బాలిక అత్యాచారానికి గురైతే ఇది వెంటనే పోస్కో సమాన నిబంధనల పరిధిలోకి కొత్త చట్టాల పరిధిలో వచ్చి చేరుతుంది. ఉగ్రవాదంపై నిర్థిష్ట నిర్వచనం ఖరారు కీలక విషయం అని, ఇంతకు ముందెప్పుడూ ఇది జరగలేదని అమిత్ షా తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులపైమాట్లాడుతూ నిర్లక్షపు డ్రైవింగ్‌తో జరిగే మరణాల కేసుల పునర్విచనం జరిగింది. ఎవరైనా వ్యక్తి ఆక్సిడెంట్‌కు పాల్పడి, తరువాత బాధితులను ఆసుపత్రికి తీసుకువెళ్లితే అక్కడ మరణం జరిగితే ఇటువంటి వాటిలో శిక్ష తీవ్రత తగ్గుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News