Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 7946 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India Recorded 42015 New Corona Cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7946 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 4.43 కోట్లకు చేరుకోగా 5.27 లక్షల మంది చనిపోయారు. గత 24 గంటల్లో 9828 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 4.38 కోట్లకు పైగా బాధితులు వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 62,748 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 212.52 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News