Thursday, May 16, 2024

శబరిమలపై 10 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

sabarimala

న్యూఢిల్లీ: శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ కోసం ఏర్పాటు చేసిన తొమ్మిది మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం 10 రోజుల్లో తన విచారణ ముగిస్తుందని ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బోబ్డే మంగళవారం సూచనప్రాయంగా వెల్లడించారు. శబరిమల తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ల కోసం గత ఏడాది ఏర్పాటు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం లేవనెత్తిన కొన్ని రాజ్యాంగపరమైన అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల మొదట్లో తొమ్మిదిమంది న్యాయమూర్తులతో చీఫ్ జస్టిస్ బోబ్డే ధర్మాసనం ఏర్పాటు చేశారు.

అయోధ్యలోని రామజన్మ భూమి వివాదంపై గతంలో రూపొందించిన తీరులో కొన్ని ప్రశ్నల పట్టికను రూపొందించి తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఎదుట ఉంచాలని చీఫ్ జస్టిస్ ఇదివరకు ఆదేశించారు. ఇందుకోసం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ జనవరి 17న ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఈ సమావేశంలో వివిధ అంశాలపై న్యాయవాదులలో ఏకాభిప్రాయం కుదరలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం చీఫ్ జస్టిస్‌కు తెలియచేశారు.

 

9 judge bench will hear Sabarimala case in 10 days, CJI SA Bobde indicates that hearing within 10 days on Sabarimala and other issues

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News