Thursday, May 2, 2024

రద్దీ ప్రాంతాల్లో మొబైల్ వ్యాక్సినేషన్

- Advertisement -
- Advertisement -

97 lakh people have been vaccinated in Telangana

24 మొబైల్ వ్యాన్లతో సిటీలో వేగంగా టీకా
97 లక్షల మందికి వ్యాక్సిన్ పూర్తి…!
కొత్తగా మరో 1,67,529 మందికి టీకా పంపిణీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 2.2 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటి వరకు 97 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డా జి శ్రీనివాసరావు అన్నారు. వీరిలో 83 లక్షల మంది ఫస్ట్ డోసు తీసుకున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో డోసుల పంపిణీని బట్టి మిగతా వారికి కూడా వేగంగా పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే 24 మొబైల్ వ్యాన్ల ద్వారా సిటీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. వీటి ద్వారా జిహెచ్‌ఎంసిలో రోజుకు 1500 మందికి టీకాలు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ సెంటర్లలో 30 ఏళ్ల పై బడిన వారికీ పంపిణీ ప్రారంభమైనట్లు గురువారం మీడియాకు తెలిపారు.ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 1,67,529 మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 1,57,958 మంది మొదటి డోసు తీసుకోగా, 9571 మంది సెకండ్ డోసు వేసుకున్నారు.

దీంతో ఇప్పటి వరకు 2,51,380 మంది హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా 1,93,556 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 2,67,823 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 1,01309 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. దీంతో పాటు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 29,44,520 మంది మొదటి, 14,144 మంది రెండో డోసు తీసుకున్నారు. ఇక 45 ఏళ్ల పై బడిన వారిలో 45,97,575 మంది మొదటి, 12,81,537 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80,61,298 మంది తొలి, 15,90,546 మంది రెండో డోసును పూర్తి చేసుకున్నారు. ఇక కొవిన్‌లో నమోదైన 85,56,340 డోసుల్లో 62,970 ఆర్మీకి కేటాయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌లో 84,83,089 డోసులు వినియోగించగా, వ్యాక్సిన్ వేస్టేజ్ 0.12 శాతం తేలింది. ఇదిలా ఉండగా కరోనా నియంత్రణ కేవలం వ్యాక్సిన్‌తోనే సాధ్యమని ఆరోగ్యశాఖ మరోసారి ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News