Saturday, June 8, 2024

రూ.25వేల లోపు రైతు రుణ మాఫీకి రూ.12,00కోట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Review Meeting on Farmer loan waiver

 

హైదరాబాద్: రూ.25వేల లోపు రైతు రుణాలు.. ఏక మొత్తం మాఫీ కింద రూ.12,00 కోట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఆర్థిక వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు హరీష్ రావు, నీరంజన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు బంధు, రైతు రుణమాఫీపై మంత్రులు సమీక్ష నిర్వహించారు.  రైతుల బ్యాంకు ఖాతాల్లో 6.10లక్షల రుణమాఫీ మెత్తాన్ని జమ చేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు. రూ.25వేలు నుంచి రూ.లక్ష లోపు ఉన్న రుణాలకు నాలుగు విడతలుగా చెల్లిస్తామన్నారు. వానకాల పంటకు రైతుబంధు కోసం రూ.7వేల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు కింద వారి బ్యాంకు అకౌంట్ లలో జమ చేయాలన్నారు. ఈ ఏడాది కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించామని మంత్రి పేర్కొన్నారు.

Minister Harish Rao Review Meeting on Farmer loan waiver

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News