Thursday, May 2, 2024

భారత్ నుంచి భూటాన్, మాల్దీవులకు టీకాలు

- Advertisement -
- Advertisement -

Vaccines from India to Bhutan and Maldives

 

న్యూఢిల్లీ : పొరుగు, కీలక భాగస్వామ్య దేశాలకు ఔషధ ఉత్పత్తుల సహకార ఒప్పందంలో భాగంగా బుధవారం భూటాన్, మాల్దీవులకు భారత్ నుంచి టీకాలు చేరుకున్నాయి. ఈ రెండు దేశాలకు టీకాలు చేరుకున్న సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఆయా ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. బుధవారం నుంచి భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సెచెల్లస్ దేశాలకు టీకాలను పంపనున్నట్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ 1,50,000 డోసులు భూటాన్‌కు, 1,00,000 డోసులు మాల్దీవులకు భారత్ పంపించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News