Friday, November 1, 2024

స్నేహితుడి భార్యను హైదరాబాద్ కు తీసుకొచ్చి….

- Advertisement -
- Advertisement -

Two Young Men Murder In Nalgonda

హైదరాబాద్: స్నేహితుడి భార్యను హైదరాబాద్‌కు తీసుకరావడమే కాకుండా ప్రశ్నించిన భర్త బంధువుపై దాడి చేయడంతో చనిపోయిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధ్య ప్రదేశ్‌కు చెందిన అంకిత్, యోగేష్ స్నేహితులు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో యోగేష్ బిజినెస్ చేస్తున్నాడు. అంకిత్ భార్యను యోగేష్ తీసుకొచ్చి రూమ్ అద్దెకు తీసుకొని అందులో ఉంచాడు. అంకిత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంకిత్ భార్య కుందన్‌బాగ్‌లో ఉన్నట్టు గుర్తించి అతడి మామ విజయ్ శుక్లాతో (65) అక్కడికి వెళ్లాడు. అక్కడ ఉన్న యోగేష్‌ను నిలదీయడంతో విజయ్‌పై దాడి చేయడమే కాకుండా తోసేశాడు. తలకు గాయంకావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయ్ శుక్లా మృతి చెందాడు. వెంటనే యోగేష్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి యోగేష్ కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News