Friday, November 1, 2024

భర్త వైద్య ఖర్చుల కోసం బిడ్డను తాకట్టు పెట్టిన తల్లి

- Advertisement -
- Advertisement -

Woman Sells 5 Month Old Son in Odisha

 

గంజాం: భర్త వైద్య ఖర్చుల కోసం కన్నకొడుకునే వదులుకునేందుకు ఓ తల్లి సిద్దమైంది. ఈ దయనీయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న భర్త కోసం పొత్తిళ్లలోని 5నెలల కొడుకును రూ.10వేలకు తన సొంత అక్కదగ్గర తాకట్టు పెట్టింది. ఈ సంఘటన ఒడిస్సాలోని గంజాం జిల్లాలో  చోటుచేసుకుంది. మహిళ తీసుకున్న నిర్ణయం స్థానికంగా అందరినీ కలిచివేసింది. వివరాల్లోకి వెళితే… ఒడిస్సాలోని గంజాం జిల్లా భంజనగర్ కు చెందిన జిలీనాయక్, దుకనాయక్ భార్య భర్తలు. మూడు నెలల క్రితం దుకనాయక్ రోడ్డుప్రమాదంలో గాయపడ్డాడు. నడవలేని స్థితిలో ఉన్న అతను ఇంటికే పరిమితమయ్యాడు. అప్పటినుంచి జిలీనాయక్ అన్ని తానై చూసుకుంటుంది. సరైన చికిత్స లేక గాయాల తీవ్రత పెరిగింది. చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతోనే ఇవిధంగా చేయాల్సివచ్చిందని దుకానాయక్ కన్నీటి పర్యతమయ్యాడు.

Woman Sells 5 Month Old Son in Odisha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News