Friday, May 31, 2024

పంజాబ్‌ లక్ష్యం 132

- Advertisement -
- Advertisement -

IPL 2021:Punjab target 132 runs

చెన్నై: ఐపిఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు మద్య జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 06  వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రస్తుత సీజన్‌లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న డికాక్‌(5 బంతుల్లో 3 )మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్‌ చివరిదాకా క్రీజ్‌లో ఉంటాడని భావించిన రోహిత్‌ శర్మను(52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) షమీ బోల్తా కొట్టించాడు.  రవి బిష్ణోయి వేసిన 7వ ఓవర్‌ ఆఖరి బంతికి ఇషాన్‌ కిషన్‌(17 బంతుల్లో 6) ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డ ఇషాన్‌…బిష్ణోయి బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. ప్రస్తుత సీజన్‌లో రోహిత్‌ ఎట్టకేలకు హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆరంభం నుంచి ఆచితూచి ఆడిన ముంబై కెప్టెన్‌.. 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఐపీఎల్‌లో 40వ ఫిఫ్టీని నమోదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News