Thursday, June 13, 2024

బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్‌హోస్టెస్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మస్కట్ నుంచి కేరళలోని కన్నూర్‌కు సుమారు ఒక కిలో బంగారాన్ని తన పురీషనాళములో దాచుకుని స్మగ్లింగ్ చేసిన ఒక యిర్‌హోస్టెస్‌ను అరెస్టు చేసినట్లు డిఆర్‌ఐ వర్గాలు గురువారం తెలిపాయి. కొచ్చిన్‌కు చెందిన డిఆర్‌ఐ ఇచ్చిన నిర్దిష్టమైన సమాచారంతో కన్నూర్ డిఆర్‌ఐ అధికారులు మస్కట్ నుంచి కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న కోల్‌కతాకు చెందిన సురభి ఖాతున్ అనే క్యాబిన్ క్రూ సభ్యురాలిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు.

960 గ్రాముల బంగారం ముద్ద రూపంలో ఆమె పురీష్ నాళంలో లభించినట్లు వర్గాలు తెలిపాయి. అనంతరం ఆమెను సంబంధిత మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా కన్నూరులోని మహిళా కారాగారానికి 14 రోజులు రిమాండ్ చేసినట్లు వారు చెప్పారు. పురీష నాళంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఒక విమాన క్యాబిన్ క్రూ సభ్యురాలు కస్టమ్స్‌కు పట్టుబడడం దేశంలోనే ఇది మొదటిసారని వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News