Friday, November 1, 2024

అదానీ పోర్ట్స్ కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Adani Ports decision
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అనేక రేవుపట్టణాలు నిర్వహిస్తున్న అదానీ పోర్ట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ వంటి దేశాలకు తమ టెర్మినళ్ల నుంచి సరకుల రవాణా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నవంబర్ 15 నుంచి అమలులోకి రానున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవ గుజరాత్‌లో అదానీలకు చెందిన ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ మాదకద్రవ్యాలు పట్టుబడ్డ నేపథ్యంలో అదానీ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ నెలలో అఫ్ఘానిస్థాన్ నుంచి ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టు మీదుగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరకున్న 3000 కిలోల హెరాయిన్‌ను డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి ఇక్కడ గమనార్హం. దీంతో అదానీ గ్రూప్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏదిఏమైనప్పటికీ ఆ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News