Friday, November 1, 2024

బిజెపి నుంచి టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: టిఆర్ఎస్ పార్టీలో చేరికలు ప్రతీ రోజు కొనసాగుతున్నాయి. ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలు తెరాస తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో రోజు రోజుకు కారు జోరు పెరుగుతూ వస్తోంది. బీజేపీ శ్రేణుల్లో నిరాశ అలుముకుంటోంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమక్షంలో ప్రతీ రోజు చేరికలు కొనసాగుతున్నాయి. ఇవాళ హూజూరాబాద్ లో వెంకట్రావుపల్లికి చెందిన 30మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. బీజేపీతో తమ పట్టణం అభివృద్ది అయ్యేది లేదని, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు మీద విశ్వాసంతో టీఆర్ఎస్ లోచేరుతున్నట్లు వారు తెలిపారు. గెల్లు గెలుపు బాధ్యత మేం తీసుకుంటామని, మా వెంకట్రావుపల్లిలో అభివృద్ధి పనులు కొనసాగించాలని వారు మంత్రిని కోరారు. తాము మాట ఇచ్చి తప్పుకునే వ్యక్తులం కాదని, ఎన్నికల వరకే అన్నట్లు మా విధానం కాదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటామన్నారు. నియోజకవర్గంలో 5000 డబులు బెడ్ రూం ఇళ్లును కట్టిస్తామన్నారు. వెంకట్రావు పల్లిలోనూ నిరుపేదలకు డబులు బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.

30 BJP leaders joined into TRS at Huzurabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News