Thursday, June 13, 2024

పాఠశాల వార్షిక వేడుకలో విషాదం: ఐదుగురు విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

Five students dead in Tasmania

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో పాఠశాల వార్షిక వేడుకలో విషాదం చోటుచేసుకుంది. హిల్‌క్రిస్ట్ స్కూల్ వేడుకలో భాగంగా గాలితో నింపిన కోటపై ఉన్న విద్యార్థులు ఉన్నారు. బలమైన గాలులు వీయడంతో గాలితో నింపిన కోట పది మీటర్ల ఎత్తుకు లేచి కిందపడింది. అందులో ఉన్న విద్యార్థులు కిందపడడంతో నలుగురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కోట రూపంలో ఉన్న బెలూన్‌కు తాళ్లు బిగించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News