Wednesday, May 1, 2024

ఇడి చార్జ్‌షీట్‌లో రాఘవ్ చద్దా పేరు: ఖండించిన ఆప్ ఎంపి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) సోమవారం స్థానిక ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన రెండవ అనుబంధ చార్జ్‌షీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పేరును ప్రస్తావించింది. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో జరిగిన సమావేశంలో రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నట్లు ఇప్పటికే అరెస్టు అయిన సిసోడియా కార్యదర్శి సి అరవింద్ తమ విచారణలో వెల్లడించినట్లు అనుబంధ చార్జ్‌షీట్‌లో ఇడి పేర్కొంది.

Also Read: వరల్డ్ టాప్ స్మార్ట్ సిటీస్ జాబితాలో హైదరాబాద్ ఎక్కడుందంటే…

సి అరవింద్ వాంగ్మూలం ప్రకారం సిసోడియా నివాసంలో జరిగిన సమావేశంలో పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజమ్, కేసులో నిందితుడైన విజయ్ నాయక్, పంజాబ్ ఎక్సైజ్ శౠఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇలా ఉండగా&సిసోడియా నివాసంలో జరిగిన సమావేశంలో తాను పాల్గొన్నట్లు ఇడి అనుబంధ చార్జ్‌షీట్‌లో పేర్కొనడంపై రాఘవ్ చద్దా మంగళవారం స్పందించారు. తాను ఎటువంటి అక్రమాలకు, నేరాలకు పాల్పడలేదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తన పేరును నిందితుడిగా ఇడి చార్జ్‌షీట్‌లో చేర్చినట్లు మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని ఆయన పేర్కొన్నారు.

Also Read: హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. డికె శివ కుమార్‌కు తప్పిన ప్రమాదం

తన ప్రతిష్టను దెబ్బతీయడానికి జరుగుతున్న దుష్ప్రచారంగా కనపడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఇడి దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో తనను నిందితుడిగా కాని అనుమానితుడిగా కాని పేర్కొనలేదని ఆయన చెప్పారు. ఇందులో తనపైన ఎటువంటి ఫర్యాదులు లేవని ఆయన పేర్కొన్నారు. ఏదో ఒక సమావేశానికి తాను హాజరైనట్లు పేర్కొన్నారే తప్ప తనను నిందితుడిగా కాని అనుమానితుడిగా కాని పేర్కొనలేదని ఆయన తెలిపారు. తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుందని ఆయన మీడియాను హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News