Friday, November 1, 2024

ముగిసిన టెట్ దరఖాస్తు గడువు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు దరఖాస్తు గడువు బుధవారం ముగియనుంది. ఈ నెల 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, బుధవారం రాత్రి 10 వరకు 2,50,9632,83,620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్ 1కు 80,990 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్ 2కు 20,370 మంది, రెండింటికీ 1,82,260 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఆఫ్‌లైన్ విధానంలో టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. టీచర్ వృత్తిలో అడుగుపెట్టాలనుకునేవారికి టెట్ తప్పనిసరి. ఇందులో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టిఆర్‌టి పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. దాంతో ఉపాధ్యాయ విద్యను అభ్యసించిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించవలసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News