Sunday, May 18, 2025

ఐపిఎల్ రీస్టార్ట్: వర్షం కారణంగా టాస్ వాయిదా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భారత్-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను (IPL) తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిస్థితులు మామూలు స్థితికి రావడంతో శనివారం నుంచి ఐపిఎల్ తిరిగి ప్రారంభంకానుంది. రీస్టార్ట్ అయిన ఐపిఎల్‌లో తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB).. కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా టాస్ వాయిదా పడింది. ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్‌సిబి ప్లేఆఫ్స్‌కు దూసుకువెళ్తుంది. అంతేకాక.. పాయింట్స్ టేబుల్‌లో మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఇక కోల్‌కతా ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News