Sunday, May 18, 2025

ఎయిడ్స్ టీకా అందని ద్రాక్షేనా?

- Advertisement -
- Advertisement -

ఏయిడ్స్ (అక్వైర్డి ఇమ్యూనో-డెఫిసియన్సీ సిండ్రోమ్) వ్యాధికి కారణమైన హెచ్‌ఐవి (హూమన్ ఇమ్యూనో వేరస్) వైరస్ బయట పడి 30 ఏండ్లు అయ్యింది. హెచ్‌ఐవి-ఏయిడ్స్కు కొంత వరకు చికిత్స, నివారణ మార్గాలు ఉన్నప్పటికీ నేటికీ ఒక నిర్దిష్టమైన టీకా అందుబాటులోకి రాలేదు. ఏ క్షణంలోనైనా హెచ్‌ఐవి-ఏయిడ్స్ టీకా అందుబాటులోకి రావచ్చని పరిశోధకులు, వైద్యులు, వైద్య ఆరోగ్య నిపుణులు వాగ్దానం చేస్తున్నప్పటికీ ఆ టీకా వార్త మాత్రం సత్యదూరంగానే కనిపిస్తున్నది. హెచ్‌ఐవి-ఏయిడ్స్ నేటికీ ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా పౌర సమాజాన్ని పట్టి పీజిస్తున్నది. నేటికీ దక్షిణ ఆఫ్రికాలో 7.7 మిలియన్ల హెచ్‌ఐవి-ఏయిడ్స్ రోగులు ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా 39.9 మిలియన్ల అభాగ్యులు దీని విషవలయంలో చిక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారని తెలుసుకోవాలి.

నేడు హెచ్‌ఐవి సోకిన వారికి ఆంటీ-రిట్రో వైరల్ థెరపీ అందుబాటు లో ఉన్నప్పటికీ పూర్తి స్థాయి హెచ్‌ఐవి-ఏయిడ్స్ టీకా మాత్రం నేటికీ అందుబాటులోకి రాలేదు. హెచ్‌ఐవి-ఏయిడ్స్ టీకా ప్రాధాన్యాన్ని గుర్తించిన నాటి అమెరికన్ అధ్యక్షుడు బిల్ క్లింటన్ చొరవతో 1998 నుంచి ప్రతి ఏట 18 మే రోజున ప్రపంచ ఏయిడ్స్ టీకా దినం లేదా ప్రపంచ హెచ్‌ఐవి టీకా అవగాహన దినం పాచించుట ఆనవాయితీగా మారింది. 18 మే ఒక ప్రపంచ ఏయిడ్స్ టీకా దినమా కాదు, హెచ్‌ఐవి-ఏయిడ్స్ టీకా రూపొందించడానికి మరోసారి పునరంకితం కావలసిన సందర్భమనివతెలుసుకోవాలి. హెచ్‌ఐవి-ఏయిడ్స్ టీకా సుసాధ్యం కావడానికి పరిశోధకులు, వైద్య వృత్తి నిపుణులు, క్లినికల్ రడపరీక్షల విభాగాలు, పౌర సమాజం సమైక్యంగా నిలువవలసిన అవసరాన్ని గుర్తు చేస్తున్న ప్రపంచ ఏయిడ్స్ టీకా దినం మన సహకారాన్ని కోరుతున్నది.

నేటికీ హెచ్‌ఐవి-ఏయిడ్స్ రోగంతో పాటు క్యాన్సర్, డెమెన్సియా, పార్కిన్సన్, అస్తమా లాంటి పలు వ్యాధులకు నిర్దిష్టమైన చికిత్సలు కాని, టీకాలు కాని అందుబాటులో లేవు, ఉపశమన దక్షత మాత్రమే కలిగించే చికిత్సలు ఉన్నాయి. హెచ్‌ఐవి-ఏయిడ్స్కు టీకాను రూపొందించడానికి ప్రధాన అడ్డుగా నిలుస్తున్నది హెచ్‌ఐవి వైరస్ త్వరగా మ్యుటేషన్ కావడమనే లక్షణమే అని గమనించాలి. అయినప్పటికీ ఎంఆర్‌ఎన్‌ఎ, బిఎన్‌ఎబిఎస్, మెసాయిక్, విఆర్సి01, ఎఎంపి ట్రయల్స్ లాంటి పద్దతుల ద్వారా హెచ్‌ఐవి-ఏయిడ్స్ ఆరోగ్య సమస్యకు టీకాలను రూపొందించా ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. హెచ్‌ఐవి-ఏయిడ్స్ టీకా రూపొందించడంలో ప్రతిబంధకాలు నిధుల కొరత, అపోహలు, సమాచార కొరత లాంటివి నిలుస్తున్నాయి.

శాస్త్రజ్ఞుల సమాజం పట్టుదలతో టీకా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ పౌర సమాజ సంఘీభావం, వ్యాప్తిని అడ్డుకోవడం, అందుబాటులో ఉన్న చికిత్సలను విధిగా తీసుకోవడం, టీకా రూపొందించడానికి అవసర పాలసీలను తీసుకురావడం, హెచ్‌ఐవి-ఏయిడ్స్ పట్ల నెలకొన్న అపోహలను రూపు మాపడం, రోగులకు భరోసా కల్పించడం, హెచ్‌ఐవి-ఏయిడ్స్ పరీక్షలు చేయించుకోవడం, టీకా రూపకర్తల కృషిని గుర్తించడం నిరంతరం కొనసాగాలి. హెచ్‌ఐవి-ఏయిడ్స్కు సరైన నిర్దిష్టమైన చికిత్సలు లేదా టీకాలు లేకపోయినప్పటికీ ఉపశమన లేదా నియంత్రణకు వైద్యం ఇవ్వడం జరుగుతోంది. నేడు శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు, క్లనికల్ పరీక్షల విభాగాలకు సవాళుగా నిలుస్తున్న హెచ్‌ఐవి-ఏయిడ్స్ టీకా కలలు త్వరలోనే సుసాధ్యం కావాలని, హెచ్‌ఐవి-ఏయిడ్స్ మరణాలు లేని ప్రపంచం రావాలని కోరుకుందాం, మన వంతు కర్తవ్యాలను నిర్వహిద్దాం. హెచ్‌ఐవిని అడ్డుకొని, ఏయిడ్స్కు చరమగీతం పాడే రోజు రావాలని ఆశిద్దాం.

  • డా. బుర్ర మధుసూధన్ రెడ్డి
  • 99497 00037
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News