ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీరు తాగడం ఎంతో ముఖ్యం. అందులోనూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయానే వేడినీరు తాగితే శరీర జీవక్రియను (మెటబాలిజం) మెరుగుపరచి, బరువు తగ్గడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. వేడి నీరు పేగు కండరాలను సడలించి, పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది.
మరొక ముఖ్యమైన ప్రయోజనం వేడినీరు శరీరం నుంచి మలినాలను తొలగిస్తుంది. వేడి నీరు శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమట ద్వారా విషపదార్థాలను బయటకు పంపుతుంది. ఇది సహజ డిటాక్స్ విధానంగా పనిచేస్తుంది. వేడి నీరు ఆకలిని నియంత్రించి, అధికాహారం తీసుకోవకుండా సహాయపడుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా వేడి నీరు రక్త ప్రసరణను మెరుగుపరచి చర్మానికి మంచి ఆక్సిజన్ అందిస్తుంది. ఫలితంగా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. వేడినీరు ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందువల్ల రోజూ ఉదయం వేడి నీరు తాగడం మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది.