Friday, July 4, 2025

అయిజలో మహిళ హత్య.. మరో మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /అయిజ: అయిజ మండల కేంద్రంలో ఓ మహిళ హత్యకు గురి కాగా మరో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ వివరాల ప్రకారం వడ్ల సరోజ(40) అనే మహిళ ధరూర్‌కు చెందిన రామచారితో గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు. వ్యక్తిగత కారణాల వల్ల భర్తను వదిలేసిన సరోజ తన తల్లి ఊరు అయిజలో తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటూ జీవనం సాగించేది. రామాచారి మరో వివాహం చేసుకొని ధరూర్ లోనే నివాసం ఉంటుండేవాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సరోజను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని, బడికి వెళ్లిన చిన్న కుమారుడు వచ్చి చూడగా తన తల్లి పడి ఉండటాన్ని చూసి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చాడు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు గుర్తించిన పోలీసులు తలకు బలమైన గాయం ఉండడంతో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.

రామాచారం మంగళవారం అయిజలోనే కనిపించాడని, అతనే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా భువనేశ్వరి(23) అనే మహిళ తనకు సంతానం కలగడం లేదన్న బాధతో భర్త ఇంట్లో లేని సమయంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటికి వచ్చి తలుపు కొడుతున్న తీయకపోవడంతో కిటికిలో నుంచి చూసేసరికి ఫ్యాన్‌కి వేలాడుతున్న కనిపించడడంతో తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ రెండు ఘటనలకు సంబంధించి సీఐ టాటా బాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఎస్‌సి శ్రీనివాసరావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News