- Advertisement -
అమరావతి: సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్యే చెప్పిందని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి శైలజానాథ్ (Sailajanath) తెలిపారు. దళితుడు సింగయ్యను కుక్కతో పోల్చడం దారుణమని అన్నారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడుపై శైలజానాథ్ మండిపడ్డారు. వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో (YSRCP Central Office) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజం చెప్పినందుకు మంత్రి నారా లోకేష్ మనుషులు బెదిరించారని ఆమె చెప్పిందని తెలియజేశారు. ఇంతకన్నా దారుణమై రాజకీయం ఇంకేమైనా ఉంటుందా? అని నిలదీశారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడుకే చెల్లిందని విమర్శించారు. సింగయ్య భార్య ఆరోపణలపై లోకేష్ నోరు ఎందుకు మెదపడం లేదు అని శైలజానాథ్ ప్రశ్నించారు.
- Advertisement -