Friday, July 4, 2025

డబుల్ సెంచరీతో చెలరేగిన గిల్.. భారీ స్కోరు దిశగా భారత్

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్: ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 311 పరుగులు ఎదుర్కొన్న గిల్ మొత్తం 21 ఫోర్లు, 2 సిక్సులతో డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఇంగ్లండ్ లో డబుల్ సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్ మెన్ గా గిల్ రికార్డు నెలకొల్పాడు. గిల్ అద్భుత డబుల్ సెంచరీతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం 120 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 472 పరుగులు చేసింది. క్రీజులో గిల్(168), వాషింగ్టన్ సుందర్(01)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News